ఎప్పుడో ఓ సినిమా అందించాడు దర్శకుడు సాగర్ చంద్ర. అప్పట్లో ఒకడుండేవాడు అంటూ శ్రీవిష్ణు-నారా రోహిత్ లతో. ఇప్పుడు మళ్లీ అతని పేరు వార్తల్లోకి వస్తోంది. దీనికి కారణం మరేం లేదు. అయ్యప్పన్ కోషియమ్ తెలుగు వెర్షన్ కు ఓ బేసిక్ స్క్రిప్ట్ ను అతని చేత తయారుచేయించడమే. అయ్యప్పన్ కోషియమ్ తెలుగు హక్కులు తీసుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తాము అనుకున్న మార్పులు చేర్పులతో ఓ బేసిక్ స్క్రిప్ట్ వర్క్ ను సాగర్ చంద్ర చేత చేయిస్తోంది.
అయితే డైరక్షన్ చాన్స్ ఇస్తారా? లేదా? అన్నది మాత్రం తెలియదు. కేవలం స్క్రిప్ట్ వర్క్ మాత్రమే. అది పెర్ ఫెక్ట్ గా వస్తే అప్పుడు చూద్దాం అనే ఆలోచనతో సాగర్ ను రంగంలోకి దింపారు. ఇప్పటి దాకా ఈ పేరు, ఈ వ్యవహారం బయటకు తెలియదు. అయితే వెంకీ-రానా లేదా, రవితేజ-రానా లాంటి కాంబినేషన్ పెట్టుకున్నపుడు ఆ రేంజ్ లో డైరక్టర్ నేమ్ కూడా యాడ్ కావాలి. అది లేకపోతే మళ్లీ క్రేజ్ కు తేడా వస్తుంది.
ఈ ఆలోచనతోనే హరీష్ అయితే ఎలా వుంటుంది అనే ఆలోచన మొదలైంది. ఇలాంటి టైమ్ లో మరి ఇన్నాళ్లు గుట్టుగా వున్న సాగర్ చంద్ర పేరు ఎలా బయట వినపడడం ప్రారంభమైందో? మెల్లగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి?