సెమిస్ లో ఇండియాకు ప్రత్యర్థి ఆ జట్టే!

క్రికెట్ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. తన ఆఖరి మ్యాచ్ లో కూడా టీమిండియా జయకేతనం ఎగరేసింది. శ్రీలంక మీద ఘన విజయం సాధించి చార్ట్ లో టాప్ పొజిషన్లో…

క్రికెట్ వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. తన ఆఖరి మ్యాచ్ లో కూడా టీమిండియా జయకేతనం ఎగరేసింది. శ్రీలంక మీద ఘన విజయం సాధించి చార్ట్ లో టాప్ పొజిషన్లో నిలిచింది టీమిండియా. మొత్తం 15 పాయింట్లతో భారత జట్టు నంబర్ పొజిషన్లో నిలిచింది.

తొమ్మిది మ్యాచ్ లకు గానూ ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దు అయ్యి ఒక పాయింట్ జమ అయ్యింది. ఇక సెమిస్ లో భారత జట్టు ప్రత్యర్థి ఎవరూ కూడా తేలిపోయింది. చార్ట్ లో నంబర్ వన్ పొజిషన్లో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమిస్ ఆడుతుంది. ఆ ప్రకారం న్యూజిలాండ్ తో టీమిండియా సెమిస్ ఆడనుంది. మంగళవారం సెమిస్ మ్యాచ్ జరగనుంది.

ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా ఓడించడంతో ఆ జట్టు చార్ట్ లో రెండో స్థానానికి పరిమితం అయ్యింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్యన రెండో సెమిఫైనల్ జరగనుంది. స్థూలంగా ప్రపంచకప్ విజేతగా నిలవడానికి  కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది టీమిండియా.

ఈ ట్రోఫీలో న్యూజిలాండ్, ఇండియా లీగ్ మ్యాచ్ వర్షంతో రద్దు అయ్యింది. న్యూజిలాండ్ మరీ అంత తేలికైన జట్టుకాదు. విజయవంతంగా సాగుతున్న ఫామ్ ను కొనసాగితే టీమిండియాకు విజయం సునాయాసమే.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?