మ‌రో హీరోయిన్ .. ఫారెన్ బాయ్ ఫ్రెండ్ తో!

ఇప్ప‌టికే ప‌లువురు భార‌తీయ న‌టీమ‌ణులు విదేశీ బాయ్ ఫ్రెండ్స్ తో ఫొటోలు దిగారు, మ‌రి కొంద‌రు పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు. ప్రీతిజింతా, శ్రియ తో స‌హా మ‌రి కొంద‌రు హీరోయిన్లు విదేశీయుల‌ను పెళ్లి చేసుకున్నారు.…

ఇప్ప‌టికే ప‌లువురు భార‌తీయ న‌టీమ‌ణులు విదేశీ బాయ్ ఫ్రెండ్స్ తో ఫొటోలు దిగారు, మ‌రి కొంద‌రు పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు. ప్రీతిజింతా, శ్రియ తో స‌హా మ‌రి కొంద‌రు హీరోయిన్లు విదేశీయుల‌ను పెళ్లి చేసుకున్నారు. శ్రుతి హాస‌న్ కూడా ఒక విదేశీ బాయ్ ఫ్రెండ్ తో కొంత కాలం పాటు ప్రేమాయ‌ణం సాగించింది. ఇక పెళ్లే త‌ర్వాయి అనే వార్త‌లు వ‌చ్చిన ద‌శ‌లో బ్రేక‌ప్ వార్త‌లూ వ‌చ్చాయి. 

ఇక ఇప్పుడు విదేశీ బాయ్ ఫ్రెండ్ ను క‌లిగిన న‌టీమ‌ణుల జాబితాలో నిల‌స్తూ ఉంది న‌టి ఇషా గుప్తా. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో చాలా హాట్ హాట్ గా క‌నిపించ‌డంతో పాటు.. త‌న ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్లో త‌రచూ బంప‌ర్ హాట్ ఫొటోల‌ను పోస్టు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది ఇషా గుప్తా. తెలుగులో 'విన‌య విధేయ‌రామ‌'లో స్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించింది ఇషా గుప్తా. బాలీవుడ్ లో హాట్ హాట్ రోల్స్ లో క‌నిపిస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉంది. ఈ క్ర‌మంలో త‌న రిలేష‌న్ షిప్ అప్ డేట్ ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది ఇషా.

స్పెయిన్ కు చెందిన వ్యాపార‌వేత్త అట ఇషా ల‌వ‌ర్. అత‌డి పేరు మాన్యూల్ కంపోస్ గుల్ల‌ర్ అట‌. అత‌డితో త‌న ఫొటోను పోస్టు చేస్తూ.. స్పానిష్ లోనే అత‌డికి ప్రేమ‌ప్ర‌తిపాద‌న కూడా చేసింది ఇషా. “te amo mucho mi amor..'' అంటూ పోస్టు చేసింది ఇషా. దీని అర్థం “I love you so much, my love. అని అట‌!

జగన్ ని అభినందిస్తున్నా

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం