జగన్ పెట్టుబడులు రాబట్టడం లేదట!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు ఆరంభించారు. జగన్ మోహన్ రెడ్డికి భయపడేది లేదంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఇలాంటి డైలాగులు వదిలినట్టుగా…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు ఆరంభించారు. జగన్ మోహన్ రెడ్డికి భయపడేది లేదంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఇలాంటి డైలాగులు వదిలినట్టుగా లేవు!

'భయపడేది లేదు.. గుండెల్లో నిద్రపోతా.. బెదిరేది లేదు.. అంతు చూస్తా…' అంటూ చంద్రబాబు నాయుడు డైలాగులు వేస్తూ ఉంటారు. ఇవి దశాబ్దాల నుంచి కొనసాగుతూ ఉన్నవే. వాటిని అసందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు ఉపయోగించేస్తూ ఉంటారు. అలా అలవాటు అయిపోయింది ఆయనకు!

ఆ రొటీన్ డైలాగులను పక్కన పెడితే చంద్రబాబు నాయుడు కొత్త ఆరోపణ చేశారు. అదేమిటంటే జగన్ మోహన్ రెడ్డి ఏపీకి పెట్టుబడులు రాబట్టడం లేదట! జగన్ బాధ్యతలు స్వీకరించి సరిగ్గా నెల కూడా కాలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు పెట్టుబడులు రాబట్టడం చేత కావడం లేదని తేల్చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు ఎలాగూ పెట్టుబడులు అంశాన్ని అప్పుడే తెరమీదకు తెచ్చారు కాబట్టి, ఆయన రాబట్టిన పెట్టుబడుల కథాకమామీషు ఏమిటో బయటపెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టుబడుల సదస్సులకు కొదవేలేదు!

కనీసం సూటూబూటు వేసుకోవడం రాని వారు కూడా ఏపీలో అప్పట్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేశారు! అవన్నీ తెల్ల కాగితాల మీదే అనుకోండి. అప్పట్లో చంద్రబాబు నాయుడు కొన్ని లక్షల కోట్ల 
రూపాయల పెట్టుబడులు సాధించేశారు! అని గట్టిగా ప్రచారం చేసుకున్నారు.

ఆ పెట్టుబడులు కట్టుకథలే అనే అంశం అప్పట్లోనే రుజువు అయ్యింది. ఇక పెట్టుబడులు తీసుకురావడానికి అని సూట్ కేసులను వెంటపెట్టుకుని చంద్రబాబు నాయుడు తిరగని దేశమూ లేదు. చంద్రబాబు నాయుడు అంత స్థాయిలో పెట్టుబడులు 'రాబట్టేసినా' ఏపీ జనాలు మాత్రం ఆయన పార్టీని ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు.

మరి అలాంటి గారడీలే జగన్ కూడా చేయాలని చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా  సినిమా రివ్యూ: కల్కి