వేరే కులం వాళ్లకు రక్తం ఇవ్వొద్దని, బ్రహ్మ తమ కులం వాడేనని, తమ కులం వాడు తప్ప రాజకీయాల్లో మరో సినిమా హీరో రాణించలేడని, రాజమౌళి కూడా కమ్మోడు అయినందువల్లనే బాహుబలి సినిమా తీయగలిగడని… ఓపెన్ గా ఆడియోలు, వీడియోల రూపంలో చెప్పుకుని కొంతమంది కమ్మ వాళ్లు తమ కుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో చాటుకున్నారు. ఇవన్నీ పతాక స్థాయి ప్రసంగాలు!
దివంగతులు, అప్పటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అయితే.. చాలా యేళ్ల తర్వాత తమ సామాజికవర్గానికి అధికారం దక్కిందని, ఇప్పుడప్పుడే దాన్ని వదులుకోకూడదని తమ కుల వనభోజనాల్లో వ్యాఖ్యానించారు!
అధికారంలో ఉన్నప్పుడు అలా.. ఇప్పుడు తమ కులం అధికారంలో లేదనే ఫ్రస్ట్రేషన్ తో కొంతమంది కమ్మ కుర్రాళ్లు సోషల్ మీడియాలో పెడుతున్న సెల్ఫీ వీడియోలు నిజంగా విస్మయాన్ని కలిగిస్తున్నాయి. మరీ ఇంత బాధేంటి, మరీ ఇంత కుల కుష్టి ఏమిటో.. అర్థం కాని పరిస్థితి. వీళ్లు నిజంగానే ఇంట్లో వాళ్ల పర్యవేక్షణలోనే ఉన్నారా , లేక కుల టెర్రరిస్టులుగా మారిపోవడానికి వీరికి ఇంట్లో వాళ్లు కూడా పర్మిషన్ ఇచ్చారా? అనే సందేహం కలుగుతుంది.
వీళ్లకు స్నేహితులంటూ ఉంటారా.. లేక వీళ్ల స్నేహితులంతా ఇలాంటి కుల కుష్టి గాళ్లేనా.. అనే సందేహమూ కలుగుతుంది. వీళ్లు సభ్యసమాజంలో మనుగడ సాగిస్తున్నారో.. లేక శాడిస్టుల్లాగా కుల గోడల మధ్యన బతుకుతుంటారో!
ఏపీలో నడుస్తున్నది రెడ్డి రాజ్యమట. మిగతా కులాలన్నీ అస్సలు పట్టించుకోవడం లేదట, కమ్మ వాళ్లు అయితే అస్సలు పట్టించుకోవడం లేదట.. ఆ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టుకుని ఎరుకుల రెడ్డి అంటూ సంబోధన! సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వీడియోలను చూస్తే.. వీళ్ల కన్నా తాలిబన్లు, ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులే బెటరేమో అనిపిస్తుంది. తమ మతవాద రాజ్యం కోసం తాలిబన్లు, ఐసిస్ టెర్రరిస్టులు ఈ తరహాలోనే యువతను టెర్రరిజం వైపు ఆకర్షిస్తూ ఉండవచ్చు. అదే తీరులో ఉంది ఈ కమ్మ కుర్రాళ్ల కుల కుష్టి.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనపై ఎవరిలో అయినా అసంతృప్తి ఉండవచ్చు. దానికి కుల కోణం కూడా ఒక కారణం కావొచ్చు. అంత మాత్రానా.. మరీ ఇలా రెచ్చిపోవడం కమ్మ వాళ్లలోనే కనిపిస్తుంది. కాపులంతా జగన్ కు సపోర్టర్లు కాదు, రాజులంతా జగన్ కు సపోర్టర్లు కాదు, ఆఖరికి రెడ్లలో కూడా జగన్ పై బోలెడంత అసంతృప్తి ఉంది. వందకు వంద శాతం కమ్మవాళ్లు చంద్రబాబును ఎలా సపోర్ట్ చేయరో, అదే రీతిన ఏ నాయకుడికి అయినా స్వకులం నుంచినే వందశాతం మద్దతు ఉండదు.
ఆపై ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమే. చంద్రబాబు కేబినెట్లో ఉన్న రెడ్డి మంత్రులతో దాదాపు సమాన స్థాయిలో మాత్రమే జగన్ కేబినెట్లో రెడ్లున్నారు. అలా అంటే.. చంద్రబాబు కేబినెట్లో తొలి మూడేళ్లూ పల్లె రఘునాథరెడ్డి ఐదు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు! జగన్ కేబినెట్లో ఏ రెడ్డికీ అన్ని శాఖలు లేవు.
రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకుని మరీ ముగ్గురు రెడ్లకు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. జగన్ కేబినెట్లో రాయలసీమ నుంచి మంత్రులుగా ఉన్న రెడ్లెంత మంది? అనంతపురం నుంచి ఏకైక మంత్రి కురుబ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి! అనంతపురం, హిందూపురం, కర్నూలు.. రెడ్ల జనాభా గణనీయంగా ఉన్న ఎంపీ సీట్లు. దశాబ్దాలుగా రెడ్లు ఎంపీలుగా గెలిచిన చరిత్ర ఉన్న నియోజకవర్గాలు. ఇప్పుడు ఆ సీట్లలో ఎంపీలంతా బీసీలే!
జగన్ అమలు పెడుతున్న సంక్షేమ పథకాల మెజారిటీ లబ్ధిదారులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఇలాంటి పరిస్థితుల్లో.. రెడ్డి రాజ్యమని, మిగతా కులాలు మానవ బాంబులై రెచ్చిపోవాలని, తిరిగి తమ రాజ్యం తేవాలని కొంతమంది కమ్మ కుర్రాళ్లు కుల ఉగ్రవాదులై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వీళ్లు మరీ ఇంత పర్వర్ట్ లుగా మారిపోవడం మాత్రం శోచనీయం. ఇలా రగిలిపోతూ వాళ్లకు వాళ్లు నిప్పు పెట్టుకోవాల్సిందే కానీ, పరిస్థితులు మాత్రం వారు పోసే అగ్నికి ఆజ్యంగా మాత్రం మారవు.