నిమ్మ‌గ‌డ్డ‌లో అదే ధిక్కారం!

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌లో అదే ధిక్కారం, అదే పౌరుషం. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలిని వ్య‌తిరేకించ‌డంలో ఆయ‌న ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్రివిలేజ్‌ క‌మిటీ నోటీసుకు సున్నితంగానే తాను చెప్ప‌ద‌ల‌చుకున్న విష‌యాన్ని…

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌లో అదే ధిక్కారం, అదే పౌరుషం. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార శైలిని వ్య‌తిరేకించ‌డంలో ఆయ‌న ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్రివిలేజ్‌ క‌మిటీ నోటీసుకు సున్నితంగానే తాను చెప్ప‌ద‌ల‌చుకున్న విష‌యాన్ని సూటిగా, గ‌ట్టిగా ఏ మాత్రం బెదురు లేకుండా తెగేసి చెప్పారు.

త‌న హ‌క్కుల‌కు  భంగం క‌లిగించార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఇచ్చిన నోటీసుపై స‌భా హ‌క్కుల క‌మిటీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శి ద్వారా నిమ్మ‌గ‌డ్డ‌కు నోటీసు పంపారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచార‌ణ‌కు సిద్ధంగా ఉండాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 

ఈ నోటీసుకు త‌న‌దైన స్టైల్‌లో నిమ్మ‌గ‌డ్డ స‌మాధానం ఇచ్చారు. తాను కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తీసుకున్నానని, హైదరాబాద్‌లో ఉన్నా.. విచారణకు హాజరుకాలేనని తేల్చి చెప్పారు.  అసెంబ్లీ, సభ్యులపై తనకు గౌరవం ఉందని ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. 

మ‌రీ ముఖ్యంగా నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీకి లేదని  నిమ్మగడ్డ గ‌ట్టిగా బ‌దులిచ్చారు. దీనిపై ప్రివిలేజ్ క‌మిటీ ఎలా స్పందిస్తుందోన‌నే ఉత్కంఠ నెల‌కుంది.

-సొదుం ర‌మ‌ణ‌

మోసగాళ్లు' పబ్లిక్ టాక్ 

'చావు కబురు చల్లగా'పబ్లిక్ టాక్