సినిమారంగమే అలాంటిది. ఒక్క సినిమా హిట కొడితే ఎక్కడికో తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. మరొక్క హిట్ కొడితే టాప్ సీట్లోకి తీసుకెళ్తుంది. డైరక్టర్ అనిల్ రావిపూడి వ్యవహారం అలాగే వుంది. ఎప్ 2 సినిమాకు నాలుగు కోట్లకు కాస్త అటు ఇటుగా తీసుకున్నారు పారితోషికం. ఆ సినిమా బ్లాక్ బస్టర్.
ఆ విజయంతో ఏకంగా మహేష్ తోనే సినిమా చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు. ఇప్పుడు ఆ సినిమాకు ఫిక్స్ అయిన రెమ్యూనిరేషన్ తెలిస్తే కాస్త ఆశ్చర్యపోవడం గ్యారంటీ. 9 కోట్ల రూపాయలను అనిల్ రావిపూడి రెమ్యూనిరేషన్ గా ఫిక్స్ చేసారు. కొద్దిరోజుల ముందే ఈ మేరకు అగ్రిమెంట్ అయింది.
అంటే జాక్ పాట్ కొట్టినట్లేగా. ఈ సినిమా కూడా హిట్ అయిందా, సుకుమార్, త్రివిక్రమ్ ల మాదిరిగా 13 నుంచి 15 కోట్ల రేంజ్ కు వెళ్లిపోతాడు అనిల్ రావిపూడి. ఒక విధంగా టాప్ చైర్ కు కాస్త దూరంగా వున్నాడు. ఇది హిట్ అయితే మరి కోట్లకు కోట్లే. అనిల్ రావిపూడి తరువాత సినిమా సాహు గారపాటితో వుండే అవకాశం వుంది.