సేవాకార్యక్రమాల్లో గ్రేటాంధ్ర సైతం

వట్టిమాటలు కట్టిపెట్టవోయ్..కొంతయినా మేలు తలపెట్టవోయ్..అన్నది అందరి సిద్ధాంతం కావాలి. ప్రతిఒక్కరు తమ తమ పరిథిలో కాస్తయినా చేయూతనిచ్చి ఆదుకుంటే సమాజంలో అసహాయులకు కాస్తయినా సహాయం అందుతుంది. ఇదే లక్ష్యంతో గ్రేటాంధ్ర కూడా ముందుకు సాగుతోంది.…

వట్టిమాటలు కట్టిపెట్టవోయ్..కొంతయినా మేలు తలపెట్టవోయ్..అన్నది అందరి సిద్ధాంతం కావాలి. ప్రతిఒక్కరు తమ తమ పరిథిలో కాస్తయినా చేయూతనిచ్చి ఆదుకుంటే సమాజంలో అసహాయులకు కాస్తయినా సహాయం అందుతుంది. ఇదే లక్ష్యంతో గ్రేటాంధ్ర కూడా ముందుకు సాగుతోంది.

మొన్నటికి మొన్న దీపావళి సందర్భంగా అనాధ బాలలకు బాణాసంచా ఫ్యాకెట్లను అందచేసింది. అనాధల కళ్లల్లో దీపావళి వెలుగులు చూసి మురిసిపోయింది.

ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా, మూగ, చెవుడు, బుద్ధిమాద్యం తో బాధపడే పిల్లలకు మాంచి బోజనం ఏర్పాటు చేసింది. ‘గేటాంధ్ర ఛారిటబుల్ ట్రస్ట్’ సారధ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సికిందరాబాద్ సమీపంలోని కార్ఖానా దగ్గర వున్న పామెన్ క్యాప్ స్కూలులో వున్న 120మంది పిల్లలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.

గ్రేటాంధ్ర ట్రస్ట్ తరపున జరిగిన ఈ కార్యక్రమంలో పామెన్ క్యాప్ సెక్రటరీ రమేష్ చందర్, ప్రముఖ వాస్తు, జ్యోతిష నిపుణులు వక్కంతం చంద్రమౌళి, గ్రేటాంధ్ర ఉద్యోగి నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.