వర్మ సినిమా.. తెలుగులో లేదు, కన్నడలో మాత్రమే..!

ఎలాగోలా విడుదల చేస్తున్నాడనుకొంటే… చివరకు మాత్రం వర్మ తన తాజా సినిమాను విడుదల చేసుకోలేకపోయాడు. “కిల్లింగ్ వీరప్పన్'' విడుదల కాలేదు! జనవరి ఒకటో తేదీన విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల…

ఎలాగోలా విడుదల చేస్తున్నాడనుకొంటే… చివరకు మాత్రం వర్మ తన తాజా సినిమాను విడుదల చేసుకోలేకపోయాడు. “కిల్లింగ్ వీరప్పన్'' విడుదల కాలేదు! జనవరి ఒకటో తేదీన విడుదల అవుతుందనుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. ఇప్పటికే పలు వాయిదాలు పడ్డ ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తానని వర్మ ప్రకటించాడు. కన్నడ వెర్షన్ మాత్రం యథాతథంగా విడుదల అయ్యింది.

శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ఆ భాషలో మిక్స్ డ్ రివ్యూలను పొందుతోంది. ప్రధానంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కావడంతో ఈ సినిమాపై ఎనలేని ఆసక్తి నెలకొంది. 'కిల్లింగ్ వీరప్పన్' విషయంలో ఇప్పటికే చాలా వాయిదాలు పడ్డాయి. వీరప్పన్ భార్య కోర్టులో పిటిషన్ వేయడం తదితర కారణాలతో ఈ సినిమా విడుదల ఆగుతూ వచ్చింది. ట్రైలర్ అయితే ఒక కాలంలోనే విడుదల అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో నూతన సంవత్సరం తొలి రోజున ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ప్రకటించాడు. ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా చేపట్టాడు. అయితే చివరకు మాత్రం సినిమా విడుదల కాలేదు.

కిల్లింగ్ వీరప్పన్ విడుదలైపోతే తను హైదరాబాద్ ను వెకేట్ చేస్తానని… ముంబై వెళ్లిపోతానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో..!