ఒక్క ఓటమితో.. ఆసీస్ క్రికెట్ లో అతిపెద్ద కుదుపు!

మొన్నటి వరకూ ఆల్ ఈజ్ వెల్… ఇప్పుడు అంతా గందరగోళం.. రికీపాంటింగ్ అయితే ప్రస్తుతం జాతీయ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు అసలు జాతీయ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడే అర్హతేలేదని…

మొన్నటి వరకూ ఆల్ ఈజ్ వెల్… ఇప్పుడు అంతా గందరగోళం.. రికీపాంటింగ్ అయితే ప్రస్తుతం జాతీయ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు అసలు జాతీయ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడే అర్హతేలేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో మరో ఆలోచన వద్దని.. వారందరినీ ఇంటికి పంపించేయాలని ఆసీస్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఇంతలోనే మైఖేల్ క్లార్క్ రిటైర్మెంట్ ను ప్రకటించాడు. యాషెష్ సీరిస్ చివరి టెస్టు ముగిసిన తర్వాత తను అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకొంటానని ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

అయితే యాసెష్ లో భాగంగా నాటింగ్ హమ్ లో జరిగిన నాలుగో టెస్టుకు ముందు వరకూ క్లార్క్ కు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగే ఆలోచన ఏదీలేదు. అలాంటి వార్తలను క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఖండిస్తూ వచ్చింది. అయితే నాలుగో టెస్టులో ఆసీస్ చిత్తు చిత్తుగా ఓడటంతో క్లార్క్ పదవికి ఎసరొచ్చింది. ప్రత్యేకించి తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా తమ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకొంది. ఈ నేపథ్యంలో క్లార్క్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దీంతో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు.

అసలు ఆసీస్ ప్రస్తుతం ప్రపంచకప్ విజేత హోదాలో ఉంది. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ లో సూపర్ ఫామ్ లో ఉన్న జట్లను అడ్డుకొని ప్రపంచకప్ విజేతగా నిలిచింది. మరి అంతటి స్థితిలోంచి నాలుగు ఐదు నెలల్లోనే పరిస్థితులు ఇలా మారిపోయాయి. ఆస్ట్రేలియన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అయినా.. ఇలాంటి సందర్భాల్లో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఎలాగో టీమిండియా, బీసీసీఐ వ్యవహారాలను చూసి నేర్చుకొంటే.. క్లార్కీ ఇంత త్వరగా గుడ్ చెప్పేవాడు కాదేమో! ఏదేమైనా.. ఇతడూ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కు సొబగు తీసుకొచ్చిన బ్యాట్స్ మనే. తన ప్రత్యేకతను చాటుకొన్న బ్యాట్స్ మనే.