బాహుబలి విడుదల వెనక్కు?

తెలుగు ప్రేక్షకులే కాదు, ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించి, ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసేలా చేస్తున్న సినిమా బాహుబలి. ఈ సినిమాను మే 15న ప్రేక్షకుల ముందుకు తెస్తామని దర్శకుడు రాజమౌళి…

తెలుగు ప్రేక్షకులే కాదు, ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించి, ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూసేలా చేస్తున్న సినిమా బాహుబలి. ఈ సినిమాను మే 15న ప్రేక్షకుల ముందుకు తెస్తామని దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రకటించారు. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ తొలివారానికి బాహుబలి విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. పోస్టు ప్రొడక్షన్ పనులు అనుకున్న రేంజ్ లో సాగకపోవడమే ఇందుకు కారణమని టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఇంకా నెల 15 రోజుల సమయం అయితే వుంది. 

కానీ ఆ లోగా పనులు పూర్తి అవుతాయా అంటే అనుమానమే అని తెలుస్తోంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్ లు, కంప్యూటర్ గ్రాఫిక్ పనులు చాలా సమయం తీసుకుంటున్నాయట. అందువల్ల మే నెల చాలా చిన్న సినిమాలకు నెలవుగా మారే అవకాశం కనిపిస్తోంది.