cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కపిలముని : పెరిగిన దూకుడుకు నిదర్శనం!

కపిలముని : పెరిగిన దూకుడుకు నిదర్శనం!

గత అయిదేళ్ల పాలన కాలంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే నోట్ల రద్దు, జీఎస్టీ అని తటాల్న ఎవరైనా సమాధానం చెబుతారు. నిజానికి అయిదేళ్లలో ఈ రెండు మాత్రమే కాదు. మోడీ సర్కారు చాలా చాలా నిర్ణయాలే తీసుకుంది. కానీ.. ప్రజలకు బాగా గుర్తుండిపోయినవి ఈ రెండు మాత్రమే. అదే ప్రస్తుత అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఓసారి అడిగిచూడండి... ప్రజలు ఎన్నెన్నో నిర్ణయాలను చెప్పగలరు? ఎన్ని చెప్పినా.. ఇంకా ఏదైనా మిస్ అయ్యామేమో అనే భావనలోనే మిగులుతారు. అవును.. దేశ ప్రజలు తన పాలనను మెచ్చిరెండోసారి కూడా తన సొంత పార్టీకే పరిపూర్ణమైన మెజారిటీ కట్టబెట్టిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ తన దూకుడు పెంచుతున్నారు.

గ్రేటాంధ్ర కొన్ని రోజుల కిందటే ఒక విశ్లేషణ కథనాన్ని అందించింది. రాజ్యసభలో తలాక్ బిల్లు ఆమోదం పొందిన రోజున, (జులై 31న)  ‘తలాక్‌కు చెక్ : శ్రీకారం మాత్రమే’ అనే కథనాన్ని అందించింది. ‘‘గత అయిదేళ్ల పాలనలో వారిలో వారే సంశయిస్తూ వచ్చిన అనేక కఠిన నిర్ణయాలను అమ్ముల పొదిలోంచి ఒక్కటొక్కటిగా బయటకు తీస్తారని అంతా అనుకున్నారు. ఆ క్రమంలో తలాక్ బిల్లు మొదటి అడుగు మాత్రమే అని భావించాల్సి ఉంటుంది. హిందూత్వ ఎజెండా బిల్లులుగా రాజకీయ ప్రత్యర్థులు ముద్రవేస్తూ ఉండే అనేకానేక బిల్లులు, ఇక వరుసగా ప్రాణం పోసుకోవచ్చు.’’ అని ఆ కథనంలో విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది సరిగ్గా అదే.

‘‘ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ ప్రత్యేకహక్కుల రద్దు, రామమందిర నిర్మాణం వంటి అనేక కీలకమైన విషయాలు భాజపా సర్కార్ ఆలోచనల్లో ఉన్నాయి. అవి తలాక్ బిల్లును మించి, దేశంలో రేకెత్తించగల సంచలనం వారికి తెలుసు. ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోగా ఆరెస్సెస్ ఎజెండాగా చాలా కాలంగా వార్తల్లో ఉన్న అంశాలన్నీ చట్టాలుగా మారినా ఆశ్చర్యం లేదు.’’ అంటూ ఆ కథనంలో జోస్యం చెప్పడం జరిగింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే.. అంతకంత దూకుడును ప్రదర్శిస్తూ మోడీ సర్కారు ఆర్టికల్ 370 ని రద్దు చేసేసింది.

ఈ దూకుడు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ ద్వంద్వ పౌరసత్వం అనేది రద్దయింది. మరి కొద్దిరోజుల్లోనే కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) అనేది అమల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. దాని మీద విపక్షాలనుంచి వెల్లువెత్తే వ్యతిరేకతలన్నిటినీ తోసిరాజనుకుంటూ మోదీ సర్కారు చెలరేగిపోతుంది. అలాగే రామమందిరానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తొందరలోనే చట్టాల రూపం దాల్చవచ్చు.

ఇక్కడ మరో సంగతిని గమనించాల్సి ఉంది. తమ కూటమిలో లేకపోయినా.. కొన్ని తటస్థ పార్టీలు మద్దతు ఇవ్వగల బిల్లులన్నిటినీ మోడీ సర్కారు త్వర త్వరగానే తేల్చేస్తుంది. అయితే రాజ్యసభలో కూడా ఎన్డీయే కూటమికి లేదా భాజపాకు పూర్తి మెజారిటీ దక్కిన రోజున.. మరిన్ని నిర్ణయాలతో చెలరేగిపోతుంది. రాజ్యసభలో వారికి పూర్తి బలం దక్కే రోజు ఎంతో దూరంలో లేదు. అదే జరిగిన తర్వాత.. రిజర్వేషన్లలో క్రీమీలేయర్ వంటి.. సాధారణంగా ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకునే ఏ పార్టీలు కూడా సహకరించని బిల్లులు కూడా చట్టాలుగా మారిపోయే అవకాశం ఉంది.

జనసేన... బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×