35 యేళ్ల‌లోపు ఈ ఐదింటిలో స్ట్రాంగ్ గా ఉండాలి!

35 యేళ్ల వ‌య‌సు దాటిన త‌ర్వాత లైఫ్ సాఫీగా సాగాలంటే.. ఐదు విష‌యాల్లో ఏ మ‌నిషి అయినా స్ట్రాంగ్ గా ఉండాలి.

35 యేళ్ల వ‌య‌సు దాటిన త‌ర్వాత లైఫ్ సాఫీగా సాగాలంటే.. ఐదు విష‌యాల్లో ఏ మ‌నిషి అయినా స్ట్రాంగ్ గా ఉండాలి. 30యేళ్ల‌లోపు మ‌నిషి జీవితం ఒక ఎత్తు. అప్ప‌టి వ‌ర‌కూ ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేసిన వారు ఉంటారు, అప్ప‌టికే అన్నింటినీ సెట్ చేసుకున్న వాళ్లూ ఉంటారు. అయితే 30 నుంచి 35 మ‌ధ్య‌న ప‌దిల ప‌రుచుకోవాల్సిన విష‌యాలు ఉంటాయి. అప్ప‌టికే ప్ర‌పంచం పూర్తిగా అర్థం కావ‌డానికి త‌గిన‌న్ని అనుభ‌వాలు ఎదుర‌య్యే ఉంటాయి. వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ఫ‌లితంగా ఐదు విష‌యాల్లో స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవ‌స‌రం అర్థ‌మ‌య్యే ఉంటుంది కూడా!

ఆరోగ్య‌మే సంప‌ద‌!

మిగిలిన జీవితంలో ఫోక‌స్డ్ గా ఉండాల‌న్నా, ప్రొడ‌క్టివ్ గా సాగాల‌న్నా.. ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ వ‌హించాలి. 35కు రీచ్ అయ్యే స‌మ‌యానికి రెగ్యుల‌ర్ ఎక్స‌ర్ సైజ్, న్యూట్రిషియ‌స్ డైట్, స్ట్రెస్ మేనేజ్ మెంట్, సెల్ఫ్ కేర్ .. ఈ విష‌యాల్లో మీకు మీరే గైడ్ గా మార‌గ‌ల‌గాలి. ఆ శ‌రీర ఆరోగ్యానికి త‌గ్గ‌ట్టుగా ఏది ఎలా.. అనే మేనేజ్ మెంట్ తెలిసి ఉండాలి! ఇవ‌న్నీ లైఫ్ స్టైల్లో భాగం అయి ఉండాలి. ఇది ఒక రోజులో అల‌వాట‌య్యేది కాదు. క‌నీసం రెండు మూడు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఇలాంటి అల‌వాట్ల‌ను జీవ‌న శైలిగా మార్చుకోవ‌చ్చు.

నిత్యం నేర్చుకోవ‌డ‌మే!

నేర్చుకోవ‌డం అనేది ఎప్ప‌టికీ అయిపోయేది కాద‌ని ఈ వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి గ్ర‌హించ‌డ‌మే కాదు, యాక్సెప్ట్ చేయ‌గ‌ల‌గాలి! ఇంకా నేర్చుకోవ‌డ‌మేనా.. ఎప్పుడూ నేర్చుకోవ‌డ‌మేనా.. అనే ప్ర‌శ్న‌లు వేసే స్థితిలో ఉండ‌కూడ‌దు! కెరీర్ విష‌యంలో అయినా, వ్యాపార వ్యాపాకాల్లో అయినా నిత్యం నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి, అవి జీవితాంతం ఉంటాయ‌నే విష‌యాన్ని గ్ర‌హించి, ఆ మేర‌కు నేర్పును పెంచుకోవ‌డం కూడా అల‌వాటుగా మారాలి, పుస్త‌కాలు చ‌ద‌వ‌డ‌మో, ఆన్ లైన్ ట్రైనింగ్ క్లాసెస్.. ఇలాంటి వాటితో బిజీ కావ‌డం, స్కిల్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు పెంచుకుంటూ ఉండాల్సిన అవ‌స‌రం అయితే ఉంది.

మంచి నెట్ వ‌ర్క్ ను క‌లిగి ఉండ‌టం!

ఏ మొబైల్ నెట్ వ‌ర్క్ నో, ఇంట‌ర్నెట్ నెట్ వ‌ర్క్ నో కాదు.. మీనింగ్ ఫుల్ ఫ్రెండ్ స‌ర్కిల్ ను క‌లిగి ఉండాలి. ప్రొఫెష‌న‌ల్ విష‌యాల్లో అయినా, ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో అయినా.. ఎప్పుడైనా అవ‌స‌రం అయిన స‌హ‌కారం అందిస్తార‌నే కొంద‌రు స్నేహితులైనా సంపాదించుకుని ఉండాలి. ప్ర‌పంచం అంతా స్వార్థ‌మ‌యం, ఎవ‌రికి ఎవ‌రూ సాయ‌ప‌డ‌రు, అంతా మోసాలే చేస్తారు.. ఇలాంటి ఫిలాస‌ఫీలు ఎన్ని ఉన్నా.. మీ అవ‌స‌రాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా స‌హ‌కారం అందించే ఒక నెట్ వ‌ర్క్ ఏర్ప‌రుచుకోవ‌డంలో ఫెయిల్ కాకూడ‌దు. జీవితంలో ఏదో ఒక ద‌శ‌లో ఎవ‌రో ఒక‌రికి మ‌నం స‌హ‌కారం అందించి ఉంటే, వాళ్లూ మ‌న‌కు ఎప్పుడో ఒక‌సారి స‌హ‌కారం అందించే అవ‌కాశాలూ ఉంటాయి. ఇలాంటి నెట్ వ‌ర్క్ ను క‌లిగి ఉండాలంటే.. అలాంటి త‌త్వం కూడా మ‌న‌లో ఉండాలి!

ఇన్వెస్ట్ మెంట్ ప‌ద్ధ‌తుల‌పై అవ‌గాహ‌న‌!

ఈ వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి న‌గ‌ర జీవితంలో అయితే సంపాద‌న త‌ప్ప‌నిస‌రి! అలాంటి సంపాద‌న‌లో కొంత మేర అయినా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్క‌డ చేయాల‌నే అంశంపై సొంత ప‌రిశోధ‌న‌, అనుభ‌వ‌జ్ఞుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఉన్న కొంత మేర డ‌బ్బును అయినా ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఎలా, ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్టాలి, జీవితంపై దాని ద్వారా ఎంతో కొంత భ‌రోసాను ఎలా క‌లిగి ఉండాల‌నేది నేర్చుకుని ఉండాల్సిన అంశం.

కెరీర్ లో ముంద‌డుగు!

ఈ వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి మీరు ఏ వృత్తిలో ప‌ని చేస్తూ ఉన్నా, అందులో మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఉండాలి. మీ ప‌ని ఏదైనా.. అందులో మీ ప్ర‌త్యేక‌త ఉండాలి. పాతికేళ్ల‌లోలోపే కెరీర్ ను మొద‌లుపెట్టిన వారు ఉంటారు కాబ‌ట్టి.. ముప్పై ఐదుకు వ‌చ్చే స‌రికి మేనేజ్ మెంట్ స్థాయికి ఎద‌గ‌గ‌ల‌గాలి!

ఈ ఐదింటిపై ముప్పై ఐదు లోపే గ్రిప్ ను సంపాదించుకుని ఉండాలి, అదే ఆ పై జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది.

4 Replies to “35 యేళ్ల‌లోపు ఈ ఐదింటిలో స్ట్రాంగ్ గా ఉండాలి!”

  1. జనాలకి అన్నీ బాగానే ఉన్నాయి.. ఆ మొదటిది తప్ప.. తాగి తందనలాడటం.. రాత్రి పార్టీ లు చేస్కొడమ్.. పడి పడి బిర్యానీలు మింగడం.. అడ్డమైన అక్రమ సంబంధాలు పెట్టుకోడం.. ఇదీ ఆధునిక జీవన శైలి..

Comments are closed.