హస్తంలో నొప్పిని కలిగించే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్

మీరు కంప్యూటర్‌ని వాడుతుంటారా?  హస్తంలోను, చేతి వేళ్లలోనూ నొప్పితో కంప్యూటర్‌ని వాడలేని పరిస్థితి ఏర్పడుతోందా? ఐతే, మీ సమస్య కర్పల్ టన్నెల్ సిండ్రోమ్ కావచ్చు. దీనికి ఆయుర్వేదంలో చక్కని చికిత్సలున్నాయి. అలాగే మీరు తెలుసుకోవాల్సిన…

మీరు కంప్యూటర్‌ని వాడుతుంటారా?  హస్తంలోను, చేతి వేళ్లలోనూ నొప్పితో కంప్యూటర్‌ని వాడలేని పరిస్థితి ఏర్పడుతోందా? ఐతే, మీ సమస్య కర్పల్ టన్నెల్ సిండ్రోమ్ కావచ్చు. దీనికి ఆయుర్వేదంలో చక్కని చికిత్సలున్నాయి. అలాగే మీరు తెలుసుకోవాల్సిన నివారణ పద్ధతులు కూడా ఉన్నాయి. ఈ సమాచారాన్ని తెలుసుకుందాం. 

ఏమిటీ వ్యాధి?

మణికట్టులోపలి ప్రదేశాన్ని కార్పల్ టన్నెల్ అంటారు.  ఇది కార్పెల్ ఎముకలతోను, అడ్డంగా అమరిన లిగమెంటుతోను నిర్మితమవుతుంది. ఒకవేళ ఇది వ్యాధిగ్రస్తమైతే అలాంటి స్థితిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. దీనిలో ప్రధానంగా మణికట్టులో ఉండే ‘మీడియన్ నరం’ మీద ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాధిలో హస్తంలోను, చేతివేళ్లలోను, బొటనవేళ్లలోను, ఒకోసారి బాహువు మొత్తంలోనూ నొప్పి, తిమ్మిరి, మొద్దుబారటం, చేతి కండరాల బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బాహువు లేదా ముంజెయ్యి నుంచి మీడియన్ నరం కార్పల్ టన్నెల్ ద్వారా ప్రయాణించి హస్తంలో అంతమవుతుంది. మామూలు వ్యక్తుల్లో ఈ నరం బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరం వేలులో కొంతభాగంలో స్సర్శను, కదిలికలను నియంత్రిస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో కార్పల్ టన్నెల్ ప్రదేశంలో ఉండే నరానికి, టెండాన్లకు తగినంత స్థలం ఉంటుంది. ఒకవేళ ఈ నిర్మాణాలు బిగుతుగా తయారై ఒరుసుకుపోతే మీడియన్ నరం మీద ఒత్తిడి పడుతుంది.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఇతర దెబ్బలూ, వ్యాధులతో పోలిస్తే కార్పల్ టన్నెల్ వ్యాధివలన ఎక్కువ పనిగంటలకు నష్టం కలుగుతుంటుంది.  ప్రతి వందమందిలోనూ కనీసం ముగ్గురు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. హస్తంలో సూదులు గుచ్చినట్లు పోట్లుగా అనిపించడం, నొప్పి, తిమ్మిర్లు వంటి లక్షణ సమూహంతో బాధపడేవారిలో  20 శాతం మందికి కార్పల్‌టన్నెల్ సిండ్రోమ్ వ్యాధి ఉంటుంది. పురుషుల కంటే మహిళల్లో దీని ఉనికి ఎక్కువ. 

కారణాలు

మీడియన్ నరం మీద ఒత్తిడి కలుగచేసే పరిస్థితులు, రక్తసరఫరాకు ఆటంకం కలిగించే కారణాలు అన్నీ కలిసి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ను కలిగిస్తాయి. అవి : 

హైపోథెరాయిడిజం, రుమటాయిడ్ ఆర్తరైటిస్, గర్భధారణ వంటి స్థితులు కార్పెల్ టన్నెల్‌లో కణజాలాన్ని పెంచుతాయి. ఫలితంగా లోపల ఒత్తిడి పెరిగి ఈ వ్యాధి ప్రాప్తిస్తుంది.

మణికట్టుకు దెబ్బలు తగలటం, ఎముకల ఉపరితలం మీద బొడిపెల మాదిరిగా ‘బోన్ స్పర్స్’ పెరగటం, టెండన్ పొరల్లో వాపు జనించటం వంటి కారణాల వల్ల కార్పల్ టన్నెల్‌లో ఖాళీ జాగా తగ్గిపోతుంది. ముఖ్యంగా మణికట్టును అసహజమైన రీతిలో వంచుతూ పదే పదే ఏదెనా పని చేసినప్పుడు టెండాన్ పొరలు ఉబ్బి ఈ సమస్యను ఉత్పన్నం చేస్తాయి. పదే పదే ఒకే ప్రదేశంలో దెబ్బతగలడాన్ని వెద్య పరిభాషలో ‘రిపీటెడ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ’ అంటారు. 

మధుమేహం వంటి స్థితుల్లో  అన్ని నరాలూ సున్నితంగా మారినట్లుగానే చేతిమణికట్టులోని మీడియన్ నరం కూడా సెన్సిటివ్‌గా తయారై ఒత్తిడికి స్పందిస్తుంది. ఫలితంగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ధూమపానం, మద్యపానాలు రెండూ నరాలను రేగేలా చేస్తాయి. ఈ క్రమంలో మీడియన్ నరం ప్రభావితమై తత్సంబంధిత లక్షణాలు మొదలయ్యే అవకాశం ఉంది. 

లక్షణాలు

ఈ వ్యాధిలో కనిపించే అతి సాధారణ లక్షణాలు తిమ్మిరి, మొద్దుబారటం, నొప్పి, కండరాల బలహీనతలు. ఇవి చేతి వేళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. అరుదుగా అరిచేతిలోనూ కనిపించవచ్చు. 

మీడియన్ నరం ఆధీనంలో ఉన్న ప్రాంతమంతా, అంటే బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరం వేలు సగభాగంలో తిమ్మిరి, నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి. 

వ్యాధి ప్రారంభంలో రాత్రిపూట లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. చెయ్యిని విదిలిస్తే అప్పటికి నొప్పి తగ్గుతుంది. 

చిటికెన వేలులో మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించవు. ఇలా మిగతా వేళ్లలో లక్షణాలు కనిపిస్తూ, చిటికెన వేలులో కనిపించకపోవడమనేది ఈ కార్పెల్‌టన్నెల్ వ్యాధిని గుర్తించడానికి తోడ్పడే ప్రధానమైన అంశం. 

దేనినెనా గట్టిగా పట్టుకున్నప్పుడు లక్షణాలు ఉధృతమౌతాయి. ఉదాహరణకు బ్రష్‌తో పళ్లుతోముకునేటప్పుడు లేదా చెంచాతో ఏదెనా తినేటప్పుడు హఠాత్తుగా చేతివేళ్లలో నొప్పి మొదలవ్వచ్చు. 

ఒక్కోసారి చేతిలోని వస్తువులు పట్టుతప్పి నేల మీద జారిపడిపోతుంటాయి. 

సీసా మూతలు తీయటం వంటి చిన్నపాటి పనులేక చేతివేళ్లలో నొప్పి వస్తుంది. 

చూపడువేలును, బొటన వేలును ఉపయోగిస్తూ పిండటం, గిచ్చటం వంటి పనులు చేయటం కష్టంగా అనిపిస్తుంది.

ఉదయం పూట చేతివేళ్లలో పట్టేసినట్లు ఉండటం కూడా ఈ వ్యాధి లక్షణమే. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు కొనసాగే వారిలో బొటనవేలు కండరాలు సన్నబడి కుంచించుకుపోయే అవకాశం ఉంది. 

వ్యాధి నిర్ధారణ

ఈ వ్యాధిని గుర్తించడానికి మీ సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన ఇతివృత్తం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, కీళ్లనొప్పులు, గర్భధారణ, థెరాయిడ్ సమస్యలు, మధుమేహం వంటి వ్యాధుల లేదా స్థితిగతులు ఈ వ్యాధికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతాయి కాబట్టి వీటి సమాచారం అవసరమవుతుంది. అలాగే మణికట్టు, చెయ్యి, మెడ మొదలెన భాగాలకు ఏవెనా దెబ్బలు తగిలాయేమో చూడాల్సి ఉంటుంది. 

మీరు రోజువారీగా చేసే పనులు, వృత్తిపనులు, కొత్తగా చేసిన లేదా అలవాటు లేకుండా చేసిన పనులగురించిన సమాచారం కూడా అవసరమవుతుంది. 

మెడ, చేతులు, భుజాలు, బాహువులు, మణికట్టు మొదలెన భాగాల్లో స్పర్శ, వాటి ఆకృతి, కండరాల పటుత్వం వంటివి పరీక్షించాల్సి ఉంటుంది.  

చేతిమణికట్టులో ఉండే మీడియన్ నరం మీద చిటికెదెబ్బ వేసి చూడాలి. హస్తంలో కరెంటు షాకు కొట్టినట్లు ఝల్లు మంటే ఈ వ్యాధిని గురించి ఆలోచించాలి.

బల్లమీద మోచేతులు ఆనించి రెండు హస్తాలను మణికట్టువద్ద లోపలివేపు ముడిచి చేతివేళ్లను కిందకు వేలాడేయాలి. నిమిషం లోపే చేతివేళ్లలో తిమ్మిర్లుగా లేదా నొప్పిగా అనిపిస్తే ఈ వ్యాధి ఉన్నట్లు అర్ధం. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

తిమ్మిరిగా ఉండే చేతివేలు మీద కొద్దిగా ఎడంగా పేపరు క్లిప్పుల మొనలను ఆనించాలి. వ్యాధి తీవ్రంగా ఉంటే రెండు మొనలమధ్యనుండే దూరాన్ని గ్రహించలేరు. అంటే, రెండు మొనలూ ఒకే బిందువులో ఉన్నట్లుగా భ్రమ కలుగుతుంది. నరం పనితీరు దెబ్బతిన్నదనటానికి ఇది సూచన. వ్యాధి తీవ్రతను ఇది సూచిస్తుంది. 

మరీ తీవ్రమైన కేసుల్లో థెరాయిడిజం, రుమాటిజం వంటి వ్యాధుల ఉనికిని తెలుసుకోవటం కోసం రక్తపరీక్షలు, మీడియన్ నరం స్థితిగతులను తెలుసుకోవటం కోసం నర్వ్ కండక్షన్ టెస్టులు, ఎక్స్‌రే పరీక్షలు, ఎమ్.ఆర్.ఐ వంటి పరీక్షలు అవసరమౌతాయి. 

చికిత్సా వ్యూహం

హస్తంలోని కార్పల్ టన్నెల్‌లో ఒత్తిడిని లేదా నొప్పిని తగ్గించటం,  నరాలు మున్ముందు మరింత దెబ్బతినకుండా నివారించడం, కండరాల శక్తి సామర్థ్యాలను పెంచడం అనేవి ఆయుర్వేద చికిత్స వల్ల సాధ్యమవుతాయి. దీనికి శోధహర ఔషధాలు, వేదనాస్థాపన ఔషధాలు, పంచకర్మ చికిత్సా పద్ధతులు అవసరమవుతాయి. వాతహర ఔషధాలు ఈ వ్యాధి చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

వాతం అనేది నాడీ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా దూషితమౌతుంది. ఆయుర్వేద చికిత్సల ద్వారా దీనిని సమస్థితికి తీసుకురావాల్సి ఉంటుంది. 

చేతులను, హస్తాలను సాగదీస్తూ చేసే వ్యాయామాలు, చేయికండరాలను బలపరిచే వ్యాయామాలూ చక్కని ఫలితాలనిస్తాయి. 

హఠాత్తుగా నొప్పి మొదలెతే ఐస్‌గడ్డలను చితక్కొట్టి అరిచేయి ఉన్నవెపున మణికట్టు మీద ప్రయోగించాలి. 

అలాగే వేడి కాపడాలను, ఐస్ ప్యాక్‌లను మార్చి మార్చి ప్రయోగించవచ్చు.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ప్రత్యేక వ్యాయామ చికిత్సల వల్ల జాయింట్లలో ఒత్తిడి తగ్గుతుంది. కండరాలకు శ్రమను తట్టుకునే శక్తి వస్తుంది. 

మసాజ్‌తో కూడిన అభ్యంగన చికిత్స వల్ల జాయింటు కదిలికలు మెరుగవుతాయి. 

వేడి కాపడం (స్వేదకర్మ) వల్ల శరీరంలో వేడి పుట్టి, రక్త ప్రసరణ మెరుగవుతుంది.  

ఐస్ ప్రయోగం (శీతలోపచారాలు) వల్ల వాపు, నొప్పీ తగ్గుతాయి.

వ్యాధి ప్రారంభావస్థలో ఉన్నప్పుడు రోజువారీగా చేసే పనుల్లో మార్పులూ చేర్పులూ చేసుకుంటే చాలావరకూ వ్యాధి తగ్గిపోతుంది. 

ఒకవేళ ఏదెనా ఒక ప్రత్యేకమైన పనిని పదే పదే చేయటం వల్ల నొప్పి వస్తున్నదనుకుంటే దానిని వీలెనన్ని తక్కువసార్లు, ఎక్కువ విరామంతో చేయాలి. 

అవసరమైతే, మణికట్టు తిన్నగా ఉండేలా పట్టీ (స్ల్పింట్) కట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట ఇలా చేయటం అవసరం.  

మధుమేహం, హైపోథెరాయిడిజం వంటివి ఉన్నాయని తేలితే వాటికి ముందు చికిత్స అవసరమవుతుంది. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఈ వ్యాధి బారినపడిన బాధితులు కొంతమంది శస్త్ర చికిత్స గురించి ఆలోచిస్తారు. శస్త్ర చికిత్సలో కార్పల్ టన్నెల్ పైకప్పులో ఉండే లిగమెంటును కత్తిరిస్తారు. ఐతే, వ్యాధి వల్ల అంతకు ముందే నరం దెబ్బతిని ఉంటే శస్త్ర చికిత్సవల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రారంభంలోనే అప్రమత్తమై తగిన ఔషధ చికిత్సలను, నివారణ పద్ధతులను పాటించటం అవసరం. 

నివారణ

ప్రాథమికంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. ఎత్తుకు తగిన విధంగా, సరైన బరువును కలిగిఉండాలి. స్మోక్ చేసే అలవాటుంటే మానేయిండి.

శక్తిని, కదిలికలను మెరుగుపరిచే వ్యాయామాలు చేయండి. 

చూపుడువేలును, బొటనవేలును ఉపయోగించటంఃఅంటే పెన్ను వంటి వస్తువులను పట్టుకునే సందర్భాల్లో సాధ్యమైనంత వరకూ  అన్ని వేళ్లనూ ఉపయోగించండి.

ఏదెనా పనిచేసేటప్పుడు మణికట్టును సాధ్యమైనంత వరకూ తిన్నగా, వంపులేకుండా ఉంచండి.

పదే పదే ఏదెనా పని చేయాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో పని ఆపేసి కొంచెం సేపు చేతులకు విశ్రాంతినివ్వండి.

ఒకే భంగిమలో ఎక్కువ సేపు దేనినీ పట్టుకోవద్దు. 

చేతలతో చేసే టైపింగు వంటి పనులను సాధ్యమైనంత నెమ్మదిగా, నిలకడగా చేయండి. అలాగే తక్కువ ఒత్తిడిని ఉపయోగించి టైప్ చేయండి. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

వెబ్రేషన్‌ని కలిగించే యంత్రాలను ఉపయోగించకండి. ఒకవేళ ఇలాంటివాటిని ఉపయోగించటం తప్పదనుకుంటే,  అదురును నిరోధించడం కోసం సరైనరీతిలో ‘‘ప్యాడింగు’’ అమర్చుకోండి. 

తలకింద చేతులుంచుకొని నిద్రపోవద్దు. 

వ్యాయామాలు చేయండి. ఇవి కూడా నొప్పిని తగ్గించాలి తప్పితే ఎక్కువ చేయకూడదు. 

ఆహారంలో ఉప్పును తగ్గించండి. (ఉప్పు వల్ల శరీరంలో అధికంగా నీరు చేరుతుంది. మణికట్టు దీనికి మినహాయింపు కాదు.) 

బీ-విటమిన్లు కలిగిన ఆహారాలను బాగా తీసుకోండి. వీటివల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. 

అశ్రద్ధ చేయకూడని సందర్భాలు

రెండు వారాలకు మించి చేతుల్లో నొప్పి, తిమ్మిరి, మొద్దుబారినట్లు ఉండటమనేది కొనసాగటం.

గృహ చికిత్సలు, ఇతర సాంత్వన పద్ధతులు ప్రయత్నించినప్పటికీ ఇవి తగ్గకపోవటం.

వస్తువులు చేతుల్లోనుంచి జారి కిందపడిపోవటం.

చూపుడువేలుతోనూ బొటనవేలితోనూ గిల్లలేకపోచటం లేదా పిండలేకపోవటం.

బొటనవేలులో బలం తగ్గిపోవటం.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు పరిస్థితి విషమంచిందని అర్ధం. ఇలాంటప్పుడు సత్వరమే వెద్య సహాయం పొందాలి. 

కంప్యూటర్ ఉపయోగించేవారికి సూచనలు

మీరు ఉపయోగించే సాధనాలన్నీ మీ ముందే ఉంచుకోండి. 

ముంజేతులను నేలకు సమాంతరంగా లేదా కొద్దిగా ముందుకు వంగేలా ఉంచండి.

ఒక వేళ మీరు నిలబడి పనిచేయాల్సి వస్తే, మీరు పనిచేసే టెబుల్ ఎత్తుని మీ నడుము ఎత్తులో ఉండేలాగా అమర్చుకోండి. 

కీబోర్డును లేదా మౌస్‌ను ఉపయోగించేటప్పుడు మణికట్టును వంచకుండా తిన్నగా ఉంచడానికి ప్రయత్నించండి. 

మోచేతులను శరీరానికి ఇరుపక్కలా, సాధ్యమైనంత దగ్గరగా ఉంచండి.

ప్రతి పది పదిహేను నిమిషాలకూ కొద్ది సమయం విరామం తీసుకోండి. 

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

ప్రతి గంటకూ ఒకసారి చేతులను సాగదీస్తూ, స్ట్రెచింగు ఎక్సర్‌సైజులు చేయండి.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వ్యాధిలో ఉపయోగపడే వ్యాయామాలు

వార్మ్‌అప్ : 

హస్తాలను మణికట్టు వద్ద ముడుస్తూ పైకీ, కిందకూ, పక్కలకూ తిప్పాలి. చేతి వేళ్లను ఒకదానికొకటి దూరంగా చాపి తిరిగి మామూలు స్థితికి తీసుకురావాలి. దీనిని నాలుగు సార్లు రిపీట్ చేయాలి. బొటన వేలును బాగా వెనకకు వంచి కొంచెం సేపు నిలకడగా ఉంచాలి. దీనిని కూడా 4 సార్లు చేయాలి. 

నమస్కార భంగిమ : 

రెండు అరిచేతులను నమస్కారం పెడుతున్నట్లుగా ఛాతిముందుకు, గడ్డం కిందకు తీసుకురావాలి. తరువాత నెమ్మదిగా రెండు చేతులను అదే భంగిమలో బొడ్డువరకూ కిందకు తీసుకువెళ్లాలి. ఇలా చేస్తున్నప్పుడు మీ ముంజేతుల్లో ఒత్తిడిని అనుభవిస్తారు. ఈ భంగిమలో 20 సెకండ్లు నిలకడగా ఉండాలి మళ్లీ యథాస్థానంలోకి వచ్చేయాలి. దీనిని 4 సార్లు రిపీట్ చేయాలి. ఆ తరువాత ఇదే భంగిమను వ్యతిరేక దిశలో చేయాలి. అంటే, ముందు నడుము వద్ద రెండు చేతులను నమస్కార భంగిలో ఉంచి నెమ్మదిగా తల వరకూ హస్తాలను మాత్రమే ఎత్తాలి. దీనిని కూడా 4 సార్లు రిపీట్ చేయాలి. అలాగే ఇదే నమస్కార భంగిమను హస్తాలను పైకి కాకుండా నేలవెపుకు తిప్పి చేయాలి. 

చేతివేళ్ల కండరాలను శక్తివంతం చేయటం:

ఒక మెత్తని రబ్బరు బంతిని వీలైనన్ని సార్లు చేతివేళ్లతో నొక్కుతుండండి.

కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లక్షణాలను తీవ్రతరం చేసే చర్యలు:

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

కీబోర్డ్‌మీద ఎక్కువసేపు టైప్ చేయటం. కంప్యూటర్ మౌస్‌ను అదే పనిగా ఉపయోగించటం, గిటార్ వంటి సంగీత సాధనాల మీద  ఎక్కువగా పనిచేయటం.

స్టీరింగు లేదా హ్యాండిల్‌ను గట్టిగా బిగించి పట్టుకొని వాహనం నడపటం.

విద్యుత్‌తో పనిచేసే డ్రిల్లింగు మిషన్లనుగాని, అదురుతో కూడిన లేదా వెబ్రేషన్ కలిగిన పనిముట్లను ఉపయోగించటం.

హెచ్చు సమయంపాటు చేతిసూదితో కుట్టటం వంటి పనులు చేయటం.

నట్లు బిగించటం, స్క్రూడ్రెవర్ తిప్పటం, బట్టలు పిండటం వంటి ‘మెలికె పనులు’ చేయటం.

స్ప్రేబాటిల్, స్క్వీజ్‌బాటిల్ వంటివి ఎక్కువగా ఉపయోగించాల్సి రావటం. 

చేతికర్రలను, చక్రాల కుర్చీలను, చంకకర్రలను, క్రీడల్లో ఉపయోగించే సామాగ్రిని అదే పనిగా చేతులతో పట్టుకోవటం. సుత్తి వంటి పనిముట్లను అలవాటు లేకుండా హెచ్చు సమయంపాటు వినియోగించటం.

నిద్రపోయేటప్పుడు మణికట్టు వద్ద లేదా ముంజెయ్యి వద్ద ముడవటం.

పుస్తకాన్ని చేతితో ఎత్తిపట్టి చదవటం. చీట్లపేకను ఎక్కువసేపు ఫ్యాన్ చేసి పట్టుకోవటం.

గృహచికిత్సలు

1. పదార్ధాలు: 15 గ్రాములు ఉమ్మెత్త గింజల చూర్ణం, 50 మి.లీ. కొబ్బరినూనె.

పద్ధతి: ఒక ఖల్వంలో 15 గ్రాములు ఉమ్మెత్త గింజలను తీసుకోవాలి. వీటిని మెత్తగా నూరిన తరువాత 50 మి.లీ. కొబ్బరినూనెను కలపాలి. తిరిగి మర్ధించాలి. తరువాత ఒక వెడల్పాటి సీసాలో పోసి నిల్వచేసుకోవాలి.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

వాడాల్సిన విధానం: దీనిని కొద్దిగా చేతిలోకి తీసుకొని వేడిపుట్టేలా రాయాలి. నొప్పిగల భాగం మీద, మణికట్టు మీద, చేతుల వేళ్ల మీద రాసుకొని సున్నితంగా మర్ధించాలి. తరువాత వేడి ఇసుకతోగాని లేదా ఇటుక పొడి మూటతోగాని లేదా హాట్‌వాటర్ బాటిల్‌తో గాని కాపడం పెట్టుకోవాలి. చివరగా వేడినీళ్లతో స్నానం చేయాలి. దీంతో హస్తంలో నొప్పి తగ్గుతుంది. 

2. పదార్థాలు : ఆముదం 100 మి.లీ., అల్లం రసం 50 మి.లీ., తేనె తగినంత (అనుపానానికి) !

పద్ధతి : 100 మి.లీ. ఆముదానికి 50 మి.లీ. అల్లం రసాన్ని కలపండి. బాగా ఉడికించండి. తడి అంతా ఆవిరైపోయి ఆముదం మాత్రమే మిగిలేట్లు కాచండి. బాగా చల్లారిన తరువాత సీసాలో పోసి నిల్వ చేసుకోండి. దీనిని ప్రతి రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో, తగినంత తేనె కలిపి సేవిస్తుంటే చేతుల వేళ్లలో నొప్పి తగ్గుతుందివాతవ్యాధుల్లో ఇది చాలా మేలు చేస్తుంది. దీనివల్ల విరేచనం సాఫీగా జరగడమే కాకుండా కడుపులో వాతం తగ్గుతుంది. అజీర్తి కూడా తగ్గుతుంది. ఇది సంధి వాతం, ఆమవాతం రెంటిలోనూ ఉపయుక్తం. 

3. పదార్థాలు : శొంఠి కొమ్ములు 50 గ్రా., ధనియాలు 50 గ్రా., జీలకర్ర 50 గ్రా., ఉప్పు తగినంత (రుచికోసం), మజ్జిగ తగినంత (అనుపానానికి). !

పద్ధతి : శొంఠి కొమ్ములు 50 గ్రా., ధనియాలు 50 గ్రా., జీలకర్ర 50 గ్రా. ఈ విధంగా ఈ మూడింటిని సమతూకంగా తీసుకొని మిక్సీ పట్టండి. తగినంత ఉప్పు కూడా కలిపి నిల్వ చేసుకోండి. దీనిని టీ స్పూన్ మోతాదుగా మజ్జిగకు కలిపి ప్రతిరోజూ రెండు పూటలా వాడుతూ ఉంటే చేతుల వేళ్లనొప్పి, ఎముకల్లో క్యాల్షియం తగ్గటం, కీళ్లు బిగదీసుకుపోవటం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఈ వారం గ్రేట్ ఆంధ్ర ఈ- పేపర్ కోసం క్లిక్ చేయండి

4. పదార్థాలు : వెల్లుల్లి గర్భాలు 50 గ్రా., పాలు ఒక కప్పు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, తేనె 50 గ్రా. !

పద్ధతి : 50 గ్రా. వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసి ఒక కప్పు పాలకు కలిపి బాగా ఉడికించండి. పాలన్నీ ఆవిరైపోయిన తరువాత మిక్సీలో వేస్తే గుజ్జులాగా తయారవుతుంది. ఇప్పుడు ఫ్రయ్యింగ్ ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, వేడెక్కిన తరువాత వెల్లుల్లి గుజ్జును వేసి వేంచండి. తడి అంతా పోతుంది. దీనికి చివర్లో 50 గ్రా. తేనె కలిపి నిల్వ చేసుకోండి. దీనిని ఒక టీ స్పూన్ మోతాదులో ఉదయం, సాయంత్రం తీసుకుంటే హస్తంలోనొప్పి, వాతపు నొప్పులన్నీ తగ్గుతాయి.

ఆయుర్వేద ఔషధాలు

ఈ కార్పెల్ టన్నెల్ సండ్రోమ్సమస్యకు శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలున్నాయి. మహాయోగరాజగుగ్గులు, వాత విధ్వంసినీ రస్, ప్రసారిణితైలం వంటివి కొన్ని.  ఐతే, ఇవి పనిచేసే తీరు ఒకొక్కరిలో ఒకో విధంగా ఉంటుంది. ఎందుకంటే మనందరమూ ఒకే రకంగా ఉండము. కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు. జన్యుపరమైన తేడాలు ఉంటాయి. కాబట్టి ముందు మీ నాడిని చూడాలి. మీ తత్వాన్ని విశ్లేషించాలి. మీ ప్రకృతిని తెలుసుకోవాలి. వ్యాధి స్థాయినీ మీ శక్తినీ పరిగణించాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉందో చూడాలి. ఆ తరువాత ఈ ఔషధాల్లో  మీకు సరిపోయే ఔషధాలను తగిన పథ్యాపథ్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదునీ, నిర్ణీతమైన కాల వ్యవధినీ నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలా ఈ హస్తం వేళ్లలో నొప్పిసమస్యను, దాని వల్ల వచ్చే ఇక్కట్లను సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు.

డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎం.డి. (ఆయుర్వేద)

Clinic Landline – 91 (040) 23742146
Mobile – 9246575510, 9177445454
E-mail: [email protected]
Web site: http://www.muralimanohar.com