ప్రపంచానికి భారతీయ నాగరికత అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటి కామసూత్ర. ఈ మాటను భారతీయులు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో బూతుగా భావిస్తారేమో కానీ, శృంగార శాస్త్రానికి సంబంధించి మనిషి ప్రవర్తన, శృంగార అనుభవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడం, శృంగారంలో స్త్రీ పురుషుల ఆసక్తులను వివరించి చెప్పడంలో కామసూత్రకు సాటైన అధ్యయనం ఇప్పటి వరకూ మరేదీ ఉండదు.
శృంగారం గురించి ప్రపంచంలో ఎన్నో అధ్యయనాలు జరిగి ఉండవచ్చు గాక వాటికి మూలం , ఏ అధ్యయనం చెప్పే అంశాన్ని అయినా కామసూత్ర ముందే ప్రస్తావించి ఉంటుంది. అలాంటి వాత్సాయన గ్రంథం ఏ తరానికి అయినా ఒక పెద్ద గైడ్!
మరి వాత్సాయన కామసూత్రాల్లో ప్రముఖమైన, ముఖ్యమైన కొన్ని శృంగార సూత్రాలు ప్రతి మనిషీ తెలసుకోవాల్సినవే. దాంపత్యంలో, ప్రేమబంధంలోనో వీటి గురించి తెలుసుకుని ఉండటం లైంగికాసక్తిని పెంచడమే కాదు, శృంగారంలో ప్రావీణ్యాన్ని కూడా ప్రసాదంగా పొందినట్టే!
డైరెక్టుగా కదనరంగంలోకి దూకొద్దు!
శృంగార సమరం ప్రారంభం గురించి కామసూత్ర చెప్పే కీలకమైన విషయం ఏమిటంటే, ఎలాంటి స్థితిలో అయినా డైరెక్టుగా కదనరంగంలోకి దూకొద్దని. స్త్రీ మూడ్ ను తెలుసుకునే పురుషుడి స్పందన ఉండాలంటూ కామసూత్ర చెబుతోంది. ప్రత్యేకించి ఆమె భుజాన్ని తాకి, పురుషుడు శృంగార ప్రతిపాదన చేయవచ్చనేది కామసూత్ర ఇచ్చే సలహా.
ముద్దే గొప్ప వ్యక్తీకరణ!
లైంగికాసక్తిని, శృంగార పరమైన క్రేజ్ ను చాటడానికి ముద్దుకు మించి గొప్ప ప్రతిపాదన లేదంటుంది కామసూత్ర. ఆ ముద్దు ఇప్పటి సినిమాల్లో చూపించే ఏ లిప్ లాకో అనుకోవద్దు! శృంగారంలో ముద్దు చేయకూడని అంగమంటూ ఏదీ ఉండకూడదని కామసూత్ర చెబుతోంది. పెదవులను పెదవులతో చుంభించుకోవడమే కాకుండా.. పెదవులతో శారీర ఆసాంతాన్ని అన్వేషించడం శృంగారంలో అద్భుతమైన అనుభవమని ప్రాచీన భారత శృంగార గ్రంథం చెబుతుంది.
శృంగారం అంటే సాన్నిహిత్యమే!
శృంగారం అంటే కేవలం లైంగికావయవాల కలయిక కాదు అనేది కామసూత్ర ఇచ్చే నిర్వచనాల్లో ఒకటి. సరస సంభాషణ, చుంభనాలు, పరస్పరం తాకడం, ఓరల్ సెక్స్, బైటింక్, మోనింగ్ లు కూడా శృంగారంలో భాగమని కామసూత్ర వివరిస్తుంది.
స్త్రీ రక్కుతుంది, పురుషుడు కొరుకుతాడు!
శృంగారంలో పతాక స్థాయి అనుభవం సొంతం అవుతున్న వేళ స్పందనల గురించి చెబుతూ, పురుషుడిని స్త్రీ తన నఖాలతో రక్కే తత్వాన్ని కలిగి ఉంటుందని ఈ గ్రంథం చెబుతుంది. అదే పురుషుడి స్పందన కొరకడం ద్వారా వ్యక్తం కావచ్చట.
ఆమెను పతాకస్థాయికి చేర్చాలి!
రతి క్రీడలో పురుషుడి పతాక స్థాయికి ఒక సారితో పూర్తయితే, స్త్రీకి మాత్రం మల్టిపుల్ ఆర్గజమ్స్ ఉంటాయని శతాబ్దాల కిందటే విశదీకరించి కామసూత్ర. కాబట్టి స్త్రీని పతాక స్థాయికి చేర్చడం పురుషుడు బాధ్యతగా తీసుకోవాలని ఈ గ్రంథం వివరిస్తుంది.