సోషల్ పాపాలు.. దిగజారుతున్న ప్రచారాలు!

‘సోషల్ మీడియా’ అనేది ఆధునిక తరానికి అందివచ్చిన ఒక అత్యద్భుతమైన అస్త్రం! ప్రతి ఒక్కరూ కూడా తమ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి.. కేవలం తమ స్నేహితులతో మాత్రమే కాకుండా, కొత్త వారితో కూడా…

‘సోషల్ మీడియా’ అనేది ఆధునిక తరానికి అందివచ్చిన ఒక అత్యద్భుతమైన అస్త్రం! ప్రతి ఒక్కరూ కూడా తమ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి.. కేవలం తమ స్నేహితులతో మాత్రమే కాకుండా, కొత్త వారితో కూడా పంచుకోవడానికి, వారి ప్రతిస్పందనలను తెలుసుకోవడానికి, ఒక ఆరోగ్యకరమైన చర్చ సాగించడానికి.. ఈ సోషల్ మీడియా ఒక అనన్య సామాన్యమైన తిరుగులేని వేదిక!

కానీ, చాలా చాలా అద్భుతాలను సర్వ నాశనం చేసినట్లే.. సోషల్ మీడియాను కూడా రాజకీయాలు కలుషితం చేసేస్తున్నాయి! ‘సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వ్యక్తి’ అని అంటేనే వాడు ఏ రాజకీయ పార్టీకో తొత్తు అయి ఉంటాడు, ఆ రాజకీయ పార్టీ భావజాలాన్ని భుజాన మోయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు.. అనే దురభిప్రాయం ప్రజల్లో వ్యాప్తి చెందేలా ఈ సోషల్ మీడియా పోకడలు మారిపోతున్నాయి!

తెలుగునాట రాజకీయ పార్టీలు.. సోషల్ మీడియా ద్వారా లేకి, చీప్ ప్రచారాలకు దిగజారుతున్నాయి. ఇది కొత్త విషయం ఏమీ కాదు గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటి దిగజారుడు వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటూ నే వచ్చారు. అయితే పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ.. హద్దులు దాటుతున్నాయి! తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.. అనే తరహా కయ్యాలకు దిగుతున్నాయి! వీటికి అంతూ దరీ ఉండడం లేదు!

తాజాగా టిడిపి లేవనెత్తిన ఒక దుర్మార్గమైన సోషల్ ప్రచారం.. వారికి అదే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడానికి కారణమైంది!!

తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ అఫిషియల్ ట్విటర్ ఖాతాలో తాజాగా ఒక పోస్టు పెట్టారు. ‘‘ఎదురించిన తండ్రి హెలికాప్టర్ ఎక్కాడు దిగలేదు. బెదిరించిన బాబాయ్ బాత్రూంకు వెళ్లాడు మళ్లీ రాలేదు. అలిగిన చెల్లి పారిపోయింది. జడిసిన తల్లి జారిపోయింది. మిగిలిన బులుగు గొర్రెలని కూడా ముంచి త్వరలోనే నియంత లండన్ పారిపోతాడు’’ అనేది వారి ట్వీట్. చాలా దిగజారుడు మాటలివి. అయితే వైసీపీ వారు కూడా ఊరుకోలేదు. ఆ స్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు. 

‘‘ఎదిరి౦చిన మామ వెన్నపోటుకు గురైనాడు. బెదిరి౦చిన బామ్మర్ది కార్ యాక్సిడె౦టులో పోయాడు. అలిగిన పిన్ని ఫాన్ కు వేలాడి౦ది. జడిసిన తమ్ముడు గొలుసులకి బలైనాడు. మిగిలిన పచ్చ కుక్కలని కుాడ త్వరలో ము౦చి సి౦గపుార్ పారిపోతారు బొల్లిగాడు పప్పు గాడు’’ అనేది వారి కౌంటర్. 

ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో పరాకాష్టకు వెళ్లిపోతున్నారు. 

రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. తమ ప్రత్యర్థి పార్టీలలో ఉండే లోపాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి! ప్రజల దృష్టిని ఆకర్షించాలి. తమ వాదనలోనే నిజం ఉన్నదని ప్రజలను నమ్మించాలి. వారి పోరాటాలు విధానాల మీద ఉండాలి. ఇలాంటి అవసరాల కోసం వారు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. అంతేతప్ప వ్యక్తిగత దూషణలు నిందలు, లేకి ప్రచారాలకు దీనిని వేదిక కానివ్వకూడదు!

ఐ టిడిపి అనే పేరుతో పెచ్చరిల్లే తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం.. కేవలం ప్రమాదం, యాదృచ్ఛికం మాత్రమే అయిన వ్యవహారాలను కూడా నిందలుగా మార్చి దుర్మార్గపు ప్రచారం చేయడానికి ప్రయత్నించింది. కానీ తమ నాయకుడి చరిత్ర చూసుకుంటే అంతకంటె ఘోరమైన విషయాలు ఉంటాయనే సంగతిని మర్చిపోయింది. ఆ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వచ్చిన కౌంటర్ వారికి అంతకంటే ఘాటుగా తగిలింది.

సింగపూర్ పారిపోవడం అనేది జనం చాలా సులువుగా నమ్మగల విషయం చంద్రబాబు నాయుడు సింగపూర్లో స్థిరాస్తులు కూడబెట్టుకుంటున్నారనేది కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న సంగతి ఎన్టీఆర్ బతికే ఉన్న కాలం నుంచి ఆయన గురించి ఇదే ప్రచారం ఉంది. ఆయన సింగపూర్ వెళ్ళిపోతారంటే జనం నమ్ముతారు.. అదే తన కూతురు చదువులు సాగుతున్న లండన్ కు జగన్ పారిపోతాడు అంటే ఎవరూ నమ్మరు!

విచక్షణ లేని, బుద్ధిలేని ప్రచారాలతో దిగజారి పోవడం తమ తమ పార్టీల పరువు కూడా తీయడమే అనే సంగతిని ఈ సోషల్ మీడియా విభాగాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.