హైదరాబాద్ వాస్తవ్యులు అయిన శ్రీ శివ రామ ప్రసాద్ మోపర్తి గారు, వారు కుదిర్చిన తన పెద్ద కుమార్తె దుర్గ వివాహానికి కుటుంబ సమేతంగా అమెరికా సందర్శించారు. శనివారం ఫెబ్రవరి 13, 2016 న అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్రం లో వాల్ నట్ గ్రోవ్ నగరం లో గ్రాండ్ ఐలాండ్ మాన్షన్ లో మధ్యాన్నం ఘనం గా పెళ్లి అయ్యిన పిదప సుమారు గం: 3:45 కు దైనిక దినచర్య నిమిత్తం వాకింగ్ కు ఒంటరిగా మాన్షన్ నుండి బయటకు వెళ్లారు.
కానీ అలా వెళ్ళిన ప్రసాద్ మోపర్తి ఇంక తిరిగి రాలెదు. సాయంత్రం 6 గం వరకు వేచి ఉండి, పిదప వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. గత మూడు రోజుల నుండి స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్స్ చేసిన గాలింపు చర్యలు విఫలం అయ్యయి. శాక్రమెంటో కు 30 మైళ్ళ దూరం లో ఉన్నవాల్ నట్ గ్రోవ్ నగరం, మరియు చుట్టు పక్క నగరాలలో 20 మందికి పైగా కుటుంబ సభ్యులు గడప గడప కు తిరిగి ప్రసాద్ మోపర్తి ఫోటో తో కూడిన కరపత్రాలు అందజేశారు.
ప్రసాద్ మోపర్తి అపహరణకు గురయ్యారు అని వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు చెప్పినా వారు దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రసాద్ మోపర్తి గారి కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులు అందించిన సమాచారం మేరకు వారు శారీరికంగా మరియు మానసికంగా మంచి ఆరోగ్యవంతులు అని తెలుస్తుంది. ప్రసాద్ మోపర్తి గారి పెద్ద కుమార్తె దుర్గ, తన తండ్రి గారి గురించి మీడియా కు చేసిన విజ్ఞప్తి వీక్షణకు ఇక్కడ క్లిక్ చెయ్యండి:
Click Here For Video
పెళ్లి సందర్భంగా చిత్రీకరించిన ప్రసాద్ మోపర్తి గారి వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ చెయ్యండి:
Click Here For Video
ప్రసాద్ మోపర్తి గారి గురించి సమాచారం తెలిసిన వారు దయచేసి [email protected] కు ఈమెయిలు చెయ్యవలెనని వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రసాద్ మోపర్తి గాలింపు చర్యలలో భారత ప్రభుత్వం, తెలంగాణా ప్రభుత్వం జోక్యం చేసుకొని మరింత విశృత గాలింపు కు స్థానిక అధికారులతో సంప్రదించాలని ప్రసాద్ మోపర్తి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.