అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ తమ కార్యవర్గ సమావేశం లో ఈ క్రింది వారిని 2016 వ సంవత్సరానికి ఏకగ్రీవం గా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఓ పత్రికా ప్రకటన లో తెలియజేశారు. అధ్యక్షుడు – రవి కొండబోలు; ఉపాధ్యక్షురాలు – శారద అకునూరి; కార్యదర్శి – ధామా భక్తవస్తలు; కోశాధికారి – రావు కల్వల. బోర్డు అఫ్ డైరెక్టర్స్: డాక్టర్ . శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, డాక్టర్. సి. ఆర్. రావ్, మురళి వెన్నం, చలపతి రావు కొంద్రకుంట మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర.
అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా నూతన అధ్యక్షుడు రవి కొండబోలు మాట్లాడుతూ – వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యం లో అక్కినేని ప్రధమ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని 2014 లో గుడివాడ లోను, ద్వితీయ పురస్కార ప్రదానోత్సవాన్ని 2015 లో హైదరాబాద్ లో ను ఘనం గా జరుపుకున్నామని అందుకు డాక్టర్. ప్రసాద్ తోటకూర కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అక్కినేని తృతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో చెన్నై లో జరుపనున్నట్లు తెలియ జేశారు.