భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతుండడంతో, చివరి మ్యాచ్‌కి క్రికెట్ అభిమానుల తాకిడి ఓ రేంజ్లో వుంది. ప్రత్యక్షంగా తిలకిస్తోన్నవారు, టీవీలకు అతుక్కుపోతున్నవారు.. వెరసి వెస్టిండీస్‌తో భారత్ తలపడ్తోన్న టెస్ట్ మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ ఏర్పడిరది.
సందట్లో సడేమియా.. అంటూ బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, మీడియా అత్యుత్సాహం పెరిగిపోయింది. ఈ అత్యుత్సాహంలోనే అనేక తప్పులు దొర్లేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్,అత్యుత్సాహంలో తప్పు మీద తప్పు చేసేస్తోంది. మొన్న సచిన్ పేరుని తప్పుగా రాసి, ధోనీ ఆగ్రహానికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గురైంది.
తాజాగా మ్యాచ్ జరుగుతుండగా, సచిన్ భార్య అంజలి స్టేడియంకి రాగా, ఆమె పేరును ‘మిస్టర్ టెండూల్కర్’ అంటూ నిర్వాహకులు డిస్ప్లే చేయడంతో సచిన్ సైతం నొచ్చుకోవాల్సి వచ్చింది. ఇంత హైప్ క్రియేట్ అయ్యాక చిన్నాచితకా తప్పులు సహజమేగానీ, అత్యుత్సాహానికి పోయి, ‘మాస్టర్’ని అవమానిస్తున్నారని అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఇంత హంగామా ఎందుకు జరుగుతోంది.? అనంటే, నో డౌట్.. సచిన్ క్రికెట్లో లెజెండ్ అన్పించుకోదగ్గ ఆటగాడే. కానీ, అతని చివరి మ్యాచ్ విషయంలో అత్యుత్సాహం చూపి, సచిన్ మెప్పు కోసం ప్రయత్నిస్తుండడం వల్ల.. తొందరపాటులో ఎక్కువ పొరపాట్లు జరిగిపోతున్నాయి. అవి సచిన్‌ని సైతం ఇబ్బంది పెడ్తున్నాయి.
మ్యాచ్ ముగిశాక సచిన్‌ని ఘనంగా సన్మానిస్తే, దానికి విలువ వుంటుందిగానీ.. చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్‌ని ఇలా ఇబ్బంది పెడితే, మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిన చివరి మ్యాచ్‌లో సచిన్ ఒత్తిడికి లోనైతేనో.?