రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్ని చూడకుండా ఉండొచ్చు కానీ ఆయనని పూర్తిగా పట్టించుకోకుండా అయితే ఉండలేం. ఏం చేసినా కానీ ఎలాగోలా జనం దృష్టిని తనవైపుకి తిప్పుకోవడంలో రాము ఎక్స్‌పర్ట్. ఎన్నో డిజాస్టర్స్ తీసి ఆడియన్స్‌ని అంతులేని టార్చర్‌కి గురి చేసిన రాము ఇప్పటికీ తన కొత్త సినిమాతో అంతో ఇంతో ఆకర్షిస్తున్నాడు.
‘సత్య 2’ పేరుతో తీసిన రాము తాజా చిత్రం ఈవారంలో విడుదల కానుంది. ట్రెయిలర్స్ చూస్తుంటే ఇందులో విషయం ఉందనే ఫీలింగ్ వస్తుంది. అయితే పబ్లిసిటీ మెటీరియల్‌కీ, సినిమాకీ చాలా తేడా ఉంది. పబ్లిసిటీతో జనాన్ని మోసం చేయడం ఈజీ. కానీ సినిమాతో కన్విన్స్ చేసి మెప్పించడం చాలా కష్టం. పబ్లిసిటీ విషయంలో రాము దాదాపుగా ప్రతిసారీ సక్సెస్ అవుతాడు.
ఆల్రెడీ చాలా మంది ఆర్జీవీ సినిమాల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఆయన డైహార్డ్ ఫాన్స్ కూడా తన మీద గౌరవం తగ్గిపోకూడదని ఆర్జీవీ తీసే చిత్రాల్ని స్కిప్ చేస్తున్నారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన మాత్రం సినిమాల మీద సినిమాలు తీస్తూనే ఉంటున్నాడు. ఇంకా రాములో మేటర్ ఏమైనా మిగిలి ఉందో లేదో అనేది అంతు చిక్కని ప్రశ్న. దానికి సమాధానం వెతుక్కుంటూ ఇప్పటికీ రాము సినిమాలు చూస్తున్న వారున్నారు. కనీసం సత్య 2తో అయినా ఈ విషయంపై ఓ ఐడియా వస్తుందో రాదో మరి.