ఎన్టీఆర్ హీరోగా ‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుందని ప్రచారం జరిగిన చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఎన్టీఆర్ ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా, మే నెల వరకు అతని డేట్స్ దొరకవు. అప్పటికి మహేష్‌తో తన సినిమా మొదలైపోతుందని, కనుక ఆ చిత్రం పూర్తయ్యాకే ఎన్టీఆర్ సినిమా ఉంటుందని కొరటాల శివ చెప్పాడు.
మహేష్ ఇంకా ‘1’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ‘ఆగడు’ చేయడానికి కమిట్ అయ్యాడు. అది ఎప్పటికి పూర్తవుతుందనేది ఇంకా తెలీదు. కనుక కొరటాల శివ సినిమా మొదలు కావాలంటే అది వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్‌తో కొరటాల శివ సినిమా డీల్ కాన్సిల్ అయిందని అనిపిస్తోంది.
డిసెంబర్‌లో మొదలు కానుందని వార్తలొచ్చిన సినిమా ఇప్పుడు ఏడాదికి పైగా వాయిదా పడుతోందంటే ఇక అది సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు తక్కువ. వారం రోజుల క్రితం అంతా రెడీ అనుకున్న సినిమా ఇప్పుడు ఇలా వెనక్కి పోవడంతో ఎన్టీఆర్ ఈ చిత్రం వదిలేసుకున్నాడని అర్థమవుతోంది. మిర్చి తర్వాత శివతో సినిమా చేద్దామనుకున్న చరణ్ కూడా లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే.