ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా కి పట్టాలెక్కక ముందే బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా వాయిదా పడిందనికొందరు, కాదు… అసలు ఈ ప్రాజెక్టే ఎన్టీఆర్ పక్కన పెట్టేశాడని కొందరుచెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం… పూరి జగన్నాథ్ కోసమే ఈసినిమాని కొరటాల త్యాగం చేశాడట. రామయ్యా వస్తావయ్యా రిజల్ట్ తో ఎన్టీఆర్‌కి దిమ్మ తిరిగిపోయింది. కొత్తవారితో రిస్క్‌లు ఇక కట్టిబెట్టాల్సిందే అనే విషయం బోధపడింది.
కానీ చేతిలో ఉన్న రెండు సినిమాలూ కొత్త దర్శకులతోనే. మరోవైపు పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలనే ఆరాటం ఉంది. సంతోష్ శ్రీనివాస్ సినిమా మొదలైపోయింది గనుక.. ఆసినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే. అందుకే పూరి సినిమాని ట్రాక్ ఎక్కించడానికి కొరటాల శివ సినిమాని పక్కన పెట్టాడు ఎన్టీఆర్.
కొరటాలకు ఏ కాల్షీట్లు కేటాయిద్దాం అనుకొన్నాడో వాటిని పూరి సినిమాకి బదలాయించే పనిలో ఉన్నాడు. అయితే కథ కుదిరితేనే సుమా. ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు ఎన్టీఆర్. ఒకవేళ పూరి కథకూడా నచ్చకపోతే మరో సీరియర్ దర్శకుడితో ప్రొసీడ్ అయిపోవాలని ఎన్టీఆర్ నిర్ణయం.