cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పది కాల్ షీట్లు @ 1.5 కోట్లు

పది కాల్ షీట్లు @ 1.5 కోట్లు

టాలీవుడ్ లో డిమాండ్ ను బట్టే రేటు. మనకు అవసరం అయితే ఎంత ఇచ్చినా, సినిమాల్లోకి తెచ్చుకోవాల్సిందే. హీరోయిన్ పూజా హెగ్డేను వాల్మీకి సినిమా యూనిట్ అలాగే తెచ్చుకుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో రెడీ అవుతున్న వాల్మీకి సినిమాలో హీరోయిన్ పాత్ర చిన్నది. ఒక విధంగా చెప్పాలంటే అదో స్పెషల్ పాత్ర మాత్రమే.

ఒక సాంగ్, కొన్ని సీన్లు. జస్ట్ 10 రోజుల వర్క్. ఈ పాత్రకు పూజాహెగ్డేను తీసుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. చిన్న పాత్ర అయినా హరీష్ తో గతంలో పనిచేసి వుండడం వల్ల ఒకే అనేసింది పూజా. కానీ రేటు దగ్గర మాత్రం నో కాంప్రమైజ్.

తన రెమ్యూనిరేషన్, ఖర్చులు, స్టాఫ్ ఖర్చు అన్నీకలిపి 10 రోజులకు జస్ట్ కోటిన్నర మాత్రమే అని తెలుస్తోంది. సరే, పాపులర్ హీరోయిన్ కావాలి, చిన్న పాత్ర కావడంతో అందరూ ఒకే అనరు. పైగా క్రేజ్ వున్న హీరోయిన్. అందుకే అడిగినంతా ఇచ్చి తీసుకున్నారు సినిమాలోకి అని తెలుస్తోంది.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?