తెలుగునాట పారితోషికంలో మహేష్‌బాబు నెంబర్ వన్! ఈ విషయంలో మరో మాటకు తావులేదు. దాదాపుగా రూ.20 కోట్లకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నాడని టాక్. వరస హిట్లు తన ఖాతాలో వేసుకొంటున్న ఈ సూపర్‌స్టార్ ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. అంతా క్యాష్ రూపంలో కాదు. పారితోషికంతో భాగంగా ఓ ఏరియా రైట్స్‌ని తన దగ్గరే ఉంచుకొంటాడు మహేష్. ఇప్పటి వరకూ అన్ని సినిమాలకూ అదే కంటిన్యూ చేశాడు.
ఆగడు విషయంలో మాత్రం పంథా మార్చాడు. తనకు ఏ ఏరియా రైట్స్ అవసరం లేదని, ఆ సొమ్ము కూడా డబ్బుల రూపంలో ఇచ్చేయమని అడుగుతున్నాడట. దాంతో… ఆగడు సినిమాపై తొలిసారి ఫిల్మ్‌నగర్‌లో నెగిటీవ్ ప్రచారం ప్రారంభమైంది. ఈ సినిమాకి విడుదలకు ముందే 14 రీల్స్ సంస్థ రూ70 కోట్లకు అమ్మేసిందని టాక్.
దాంతో పాటు మహేష్ కూడా తన పారితోషికాన్ని సొమ్ముల రూపంలోనే తీసుకొన్నాడు. ఇదంతా చూస్తే.. సినిమా ఏమైనా తేడా కొట్టిందా..?? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ''ఏ సినిమాఎప్పుడు ఆడుతుందో, ఎప్పుడు ఫ్లాప్ అవుతుందో చెప్పలేం. ముందు జాగ్రత్త చర్యగానే మహేష్ తన ప్లాన్ మార్చాడు..'' అని మహేష్ అభిమానులు చెబుతున్నారు.