ఈసారి కూడా ముగ్గురు హీరోయిన్లతో ముద్దులాటలు

ఒకసారి ట్రెండ్ షురూ చేస్తే దాన్ని కొన్ని సినిమాల పాటు అలానే కొనసాగించడం బాలయ్యకు అలవాటు. పైసా వసూల్ సినిమా కోసం గడ్డం పెంచాడు ఈ హీరో. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా…

ఒకసారి ట్రెండ్ షురూ చేస్తే దాన్ని కొన్ని సినిమాల పాటు అలానే కొనసాగించడం బాలయ్యకు అలవాటు. పైసా వసూల్ సినిమా కోసం గడ్డం పెంచాడు ఈ హీరో. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం కూడా అదే గడ్డాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇక పైసా వసూల్ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేశాడు. ఇప్పుడు కేఎస్ రవికుమార్ సినిమాలో కూడా ముగ్గుర్ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు.

పూరి డైరక్షన్ లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది. మరో రెండు కీలక పాత్రల్లో ముస్కాన్, కైరా దత్ కనిపిస్తారు. మొత్తమ్మీద సినిమాలో ముగ్గురు భామలున్నారు. ఇప్పుడు కేఎస్ రవికుమార్ సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లను చూపిస్తారట.  

ఒక హీరోయిన్ గా ఇప్పటికే నయనతారను ఫిక్స్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. పైసా వసూల్ టైమ్ లో తనను బాగా పొగిడిన కైరా దత్ కు బాలయ్య ఈ సినిమాలో కూడా మరో అవకాశమిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది.