‘గౌరవం’ ఫేం యామీ గౌతమ్, నటనకు ప్రాధాన్యత వుండే పాత్రలు తప్ప, మోతాదు మించిన గ్లామరస్ పాత్రలకు ఒప్పుకోనంటోంది. తెరపై అందంగా కన్పించడమే గ్లామర్.. అలాగని గ్లామర్ శృతిమించేసి, వల్గారిటీ వరకూ వెళ్ళాల్సి వస్తే.. సినిమా ఆఫర్లను వదులుకుంటానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది యామీ గౌతమ్.
హీరోయిన్ అన్నాక బికినీ తప్పనిసరేమో.. అని అడిగితే, ‘ముందే చెప్పాను కదా.. నా దగ్గర బికినీ ప్రస్తావన తేవొద్దని ముందే చెప్పేస్తా దర్శక నిర్మాతలకి..’ అని తేల్చి చెప్పిన యామీ గౌతమ్, నటనా రంగంలోకి వచ్చేటప్పుడే తనకంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది.
అటు బాలీవుడ్‌లోనూ ఇటు సౌత్‌లోనూ నెమ్మదిగా కెరీర్ బిల్డప్ చేసుకుంటున్న యామీ, తనకేమీ అవకాశాల విషయంలో తొందర లేదనీ, నటిగా ప్రూవ్ చేసుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయనేది తన నమ్మకమని చెబుతోంది.