చాలాకాలం నుంచి వినిపిస్తున్నట్లుగానే బయోపిక్ శ్రీదేవిగా తయారై రకుల్ ప్రీత్ సింగ్ వచ్చేసింది. బయోపిక్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ లో భాగంగా శ్రీదేవి 'ఆకుచాటు పిందె తడిసె' పాట వుంటుందని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆ పాట కోసం రకుల్ ను తీసుకుంటారనీ వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారికంగా, ఎన్ బి కె యూనిట్ రకుల్ స్టిల్ ను విడుదల చేసింది.
ఆకాలంలో శ్రీదేవి హెయిర్ స్టయిల్ తో, అదే తెల్లచీరతో, అదే క్యూట్ లుక్స్ తో రకుల్ కనిపిస్తోంది. శ్రీదేవిలా వుందా లేదా అన్న పాయింట్ పక్కన పెడితే, రకుల్ కొత్తగా మరింత క్యూట్ గా వున్న మాటవాస్తవం. ఇదిలా వుంటే సినిమాలో ఆరేసుకోబోయి లాంటి హిట్ సాంగ్ వుంటుందా? ఉండదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు.
ఆ పాట వుంటే జయప్రద క్యారెక్టర్ వుండాలి. దానికోసం రాశీఖన్నా పేరు పరిశీలనలో వుంది అని ఆ మధ్య వినిపించింది. అయితే జయప్రద క్యారెక్టర్ ను బయోపిక్ లో వుంచాలా? వద్దా? అన్నది ఇంకా డిస్కషన్ లోనే వున్నట్లు తెలుస్తోంది.
జయప్రద తెలుగుదేశం పార్టీని వీడివెళ్లారు. ఆమెకు తెలుగదేశం పార్టీకి అంత సంబంధ బాంధవ్యాలు లేవు. మరి అందువల్ల ఆ క్యారెక్టర్ వుంటుందా? ఆ పాట వుంటుందా? అన్నది అనుమానమే.