సంక్రాంతికి వస్తామని కచ్చితంగా చెబుతున్న గోపాల గోపాల సినిమాను కాస్తయినా వెనక్కు జరపడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాయబారం నడుపుతున్నారన్న వార్తలు టాలీవుడ్ సర్కిళ్లలో వినవస్తున్నాయి.
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తొలి చిత్రం ముకుంద సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఆ వెంటనే గోపాల గోపాల యూనిట్ కూడా తమ సినిమా కూడా జనవరి విడుదలకు రెడీ అవుతోందని ప్రకటించింది.
దీంతో రెండు సినిమాలు ఒకేసారి వస్తాయా అన్న అనుమానం పెరిగింది. ఎందుకంటే బాబాయ్ ఒకదాంట్లో అబ్బాయ్ ఒకదాంట్లో నటిస్తున్నారు కాబట్టి. ఈ పరిస్థితి రాకుండా వుండేందుకు వీలుగా గోపాల గోపాల సినిమాను పండుగ తరువాతి వారానికి మార్చాలని పవన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.
లేదూ అంటే ఫిబ్రవరి తొలివారానికి మార్చమంటున్నారని వార్తలు వినవస్తున్నాయి. నాగబాబు అంటే పవన్ కు చాలా అభిమానం. అలాంటిది ఆయన కుమారుడి తొలి సినిమా వస్తుంటే, తన సినిమాను దానిపై పవన్ విడుదల కానిస్తారా అన్నదే ఈ తరహా వార్తలకు మూలం.