పాపం.. వరుణ్ సందేశ్. హిట్టు మొహం చూసి చాలా ఏళ్లయ్యింది. ఈ కుర్రాడిపైజనాలకూ నమ్మకం పోయింది. అయినా ఏదోలా సినిమాల్ని సంపాదించుకొంటున్నాడు. అయితే ప్రతీసారీ 'బ్యాడ్‌టైమ్'లో పడుతున్నాడు. ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాల్ని పోటీ లేకుండా బరిలో దింపుకోవాలి. వచ్చేటప్పుడు కాస్త హంగామా చేయాలి. కానీ.. వరుణ్ మరోసారి బ్యాడ్టైమ్లో తన సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.
జ్యోతిలక్ష్మి, కేరింత… అనే రెండు క్రేజీ ప్రాజెక్టుల మధ్య నలిగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. వరుణ్ సందేశ్ ద్విపాత్రాభినయం చేసిన లవకుశ కూడా వీటితో పాటు విడుదల అవుతోంది. ఛార్మి – పూరిల జ్యోతిలక్ష్మిపై జనాల ఫోకస్ బాగానే ఉంది. బీసీల్లో ఈ సినిమాని విపరీతంగా చూసే ఛాన్స్ ఉంది. ఇక కేరింత.. `ఇది దిల్‌రాజు సినిమా` అనే బ్రాండ్‌మీద బయటకు వస్తుంది.
ట్రైలర్లలో హ్యాపీడేస్ లుక్ కనిపిస్తున్న ఈ సినిమాపై కాలేజీ పోరగాళ్లు దృష్టిపెడతారు. మరి.. లవకుశకు జనాలుంటారా అన్నది అనుమానం. దానికి తోడు.. లవకుశ ప్రచారం మరీ డల్‌గా ఉంది. అసలు ఈ సినిమా ఒకటొస్తుందన్న సంగతే జనాలకు తెలీదు. అలాంటప్పుడు వరుణ్ సినిమా పోటీలో నిలబడుతుందా..? నిలబడినా తట్టుకొంటుందా..?? వరుణ్ ఈ లవకుశమీదా ఆశ వదులుకోవాల్సిందే.