లయన్ కు అనుకోని సమస్య

డీటీఎస్ ఇంజినీర్ మధుసూదన రెడ్డి మరణం లయన్ సినిమాపై ప్రభావం చూపిస్తోంది. దీని డీటీఎస్ వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు. దాదాపు ఇంకా సగం సినిమా చేయాల్సి వుంది. మరో పక్క డబ్బింగ్ జరుగుతోంది. దీంతో…

డీటీఎస్ ఇంజినీర్ మధుసూదన రెడ్డి మరణం లయన్ సినిమాపై ప్రభావం చూపిస్తోంది. దీని డీటీఎస్ వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు. దాదాపు ఇంకా సగం సినిమా చేయాల్సి వుంది. మరో పక్క డబ్బింగ్ జరుగుతోంది. దీంతో ఇప్పుడు సినిమా అనుకున్నట్లు 1వ తేదీకి ఎలాగైనా రెడీ చేయాలని యూనిట్ కిందా మీదా అవుతోంది. మరీ తప్పకుంటే అప్పుడు 7 వ తేదీకి వెళ్లాల్సి వుంటుంది. 

కానీ ఆ పరిస్థితి రాకుండా ఎలాగైనా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇదిలా వుంటే లయన్ కు బయ్యర్లు రెడీగా వున్నారని, నైజాం కు ఆసియన్ సునీల్, వైజాగ్ భరత్ రెడ్డి/నట్టికుమార్ , ఇలా ఏరియాల వారీగా ఫిక్స్ అయ్యారని, అయితే ఒకసారి డేట్ ఫిక్స్ అయ్యాక, బయ్యర్లు ఫైనల్ అవుతారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఓవర్ సీస్, బెంగుళూరు అమ్మకాలు జరిగిపోయాయట. ఇప్పటికే లయన్ ఒకసారి డేట్ మారింది. 30 న వేయాలనుకున్నారు. తరువాత 1కి మార్చారు. ఇదిలా వుంటే లయన్ కనుక తప్పని సరి పరిస్థితుల్లో 7కు వెళ్తే కిక్ 2 ను ఏం చేస్తారో మరి?