మ‌హేష్‌కి పోటీ లేదా?

మ‌హేష్ బాబుకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా క‌లిసొచ్చింది. ఒక్కడు, సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బిజినెస్‌మేన్ సినిమాలు సంక్రాంతి బ‌రిలోనిలిచి.. విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు `1`కూడా ఈ సంక్రాంతికే రాబోతోంది. చూస్తుంటే ఈ యేడాదీ మ‌హేష్…

మ‌హేష్ బాబుకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా క‌లిసొచ్చింది. ఒక్కడు, సీత‌మ్మవాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బిజినెస్‌మేన్ సినిమాలు సంక్రాంతి బ‌రిలోనిలిచి.. విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు `1`కూడా ఈ సంక్రాంతికే రాబోతోంది. చూస్తుంటే ఈ యేడాదీ మ‌హేష్ కి ఎదురులేద‌నిపిస్తోంది. 

ఎందుకంటే ఈ సంక్రాంతికి మహేష్ కి ధీటుగా నిలిచే సినిమాలేవీ క‌నిపించ‌డం లేదు. హార్ట్ ఎటాక్‌, రేయ్‌, పాండవులు పాండ‌వులు తుమ్మెద, రేసుగుర్రం ఈ సంక్రాంతికి వ‌స్తాయ్ అంటున్నారు. అయితే రేసుగుర్రం సినిమా డౌటులో ప‌డింది. రేయ్ పై ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. పూరి జ‌గ‌న్నాథ్ త‌న మ్యాజిక్ మ‌ర్చిపోయాడు. ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో చెప్పలేం. ఇక తూనీగ తూనీగ గురించి ఎక్కవ ఆశించ‌లేం. 

దాంతో మ‌హేష్ ఒక్కడే సంక్రాంతి పండ‌గ క్లీన్ స్వీప్ చేసే అవ‌కాశాలున్నాయి. పైగా ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేట‌ర్లలో ఈ సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. చూస్తుంటే మ‌హేష్‌కి పోటీ లేన‌ట్టే అనిపిస్తోంది. మ‌రి `1`కి దీటుగా నిలిచే మ‌రో హీరో ఎవ‌రొస్తారో, వ‌చ్చిన ఎలా నిలుస్తారో చూడాలి.