Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ పండగ చేస్కో

మళ్లీ పండగ చేస్కో

పరుచూరి ప్రసాద్-రామ్-గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పండగ చేస్కో సినిమా ఏ ముహుర్తంలో ప్రారంభించారో కానీ, అలా అలా సాగుతూనే వుంది షూటింగ్. మొదట అనుకున్న స్క్రిప్ట్ ను కాస్త అటుఇటు మార్చారని అప్పట్లో వార్తలు వినవచ్చాయి. ఒక షెడ్యూలు అయ్యాక ఆగిందని వార్తలు వినిపించాయి. 

ఆఖరికి ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోందని వినికిడి. అయితే ఈ స్టేజ్ లో కూడా స్క్రిప్ట్ లో కాస్త మార్పులు చేర్పులు చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఇంకా ఓ పెద్ద షెడ్యూలే బకాయి వుందని, ఎలా లేదన్నా ఇంకో రెండు నెలలు పడుతుందని తెలుస్తోంది. అంటే పండుగ రావాలన్నా, చేస్కోవాలన్నా ఇంకో రెండు నెలలు ఆగాలి. 

బాహుబలి, రుద్రమదేవి, సన్నాఫ్ కృష్ణమూర్తి లాంటి సినిమాలు దాటాక వదలాలి. అంటే జూన్ వచ్చేస్తుంది. అప్పటికి రామ్ సినిమా జనాలు చూసి, ఏడాదిన్నర దాటిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?