నైజాం థియేటర్లకు పండగ

తెలుగు సినిమాలకు నైజాం ఓ ట్రెజర్ లాంటిది. సరైన సినిమా పడాలే కానీ కాసులు కుప్పలుగా రాల్తాయి. అందుకే దానిపై ప్రత్యేక దృష్టి అందరికీ. అయితే అక్కడ థియేటర్ల సమస్య కూడా వుంది ఎక్కవగా.…

తెలుగు సినిమాలకు నైజాం ఓ ట్రెజర్ లాంటిది. సరైన సినిమా పడాలే కానీ కాసులు కుప్పలుగా రాల్తాయి. అందుకే దానిపై ప్రత్యేక దృష్టి అందరికీ. అయితే అక్కడ థియేటర్ల సమస్య కూడా వుంది ఎక్కవగా. కారణం కేవలం ఒకరిద్దరి చేతిలో ఎక్కువ థియేటర్లు లీజులో వుండిపోవడం. 

అయితే మొన్నమొన్నటి దాకా థియేటర్లు వున్నవారే ఎక్కువగా సినిమాలు కూడా కొనేవారు. కానీ ఆ మధ్య చాలా సినిమాలు ఫట్ మనడంతో సినిమాలు కొనడం తగ్గించేసారు. కచ్చితంగా చెప్పాలంటే మానేసారు. గోవిందుడు మొదలుకున్న అన్నీ పంపిణీ చేయడం, థియేటర్ రెంట్ తదితర ఖర్చులు మినహాయించుకుని వచ్చినది ఇవ్వడం.  పెద్ద సినిమాలు అన్నీ అయిపోవడంతో చిన్న సినిమాల వరద నెల రోజులుగా వెల్లు వెత్తుతోంది. 

దాంతో నైజాం థియేటర్లకు విపరీతమైన డిమాండ్. దాన్ని బట్టే అద్దెలు కాస్త అటు ఇటుగా వుంటాయి. పైగా గ్యాప్ లేకుండా అన్నీ కోత్త సినిమాలే కావడం కూడా థియేటర్లకు కలిసి వచ్చే అశం. సినిమా ఆడడంతో సంబంధం లేకుండా కేవలం పంపిణీ బాధ్యతలే తీసుకోవడంతో ఇప్పుడు నైజాం పంపిణీ దారులు మళ్లీ కాస్త  కుదుటపడుతున్నట్లు వినికిడి. నైజాంలో ఎక్కువ థియేటర్లు నిర్మాత దిల్ రాజుకు ఆసియన్ సునీల్ కు వున్నట్లు వినికిడి.