Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పరుశురామ్ పరిస్థితి ఏమిటి?

పరుశురామ్ పరిస్థితి ఏమిటి?

డైరక్టర్ పరుశురామ్.. గీతగోవిందం ముందు, తరువాత అని చెప్పుకోవడానికి బాగానే వుంది కానీ వాస్తవ పరిస్థితి చూస్తుంటే ఒక్కలాగే వుంది. శ్రీరస్తు శుభమస్తుకు ముందు తరువాత అన్నట్లుగా. గీత గోవిందం వచ్చి 10నెలలు దాటింది. ఇప్పటి వరకు ఇదీ సినిమా అని కానీ, హీరో ఇతగాడే అని కానీ ఫిక్స్ కాలేదు. నిర్మాతలకు కరువా అంటే బోలెడు మంది వున్నారు. కానీ గీతాలో సినిమా అనుకుంటూ, మహేష్ నో, ఆ రేంజ్ హీరోనో అనుకుంటూ అలా వుండిపోయారు.

అలాంటిది ఇటీవల మహేష్ బాబుతో పక్కాగా సినిమా అనే వార్త బయటకు వచ్చింది. దర్శకుడు కొరటాల శివ సహకారంతో పరుశురామ్ వెళ్లి మహేష్ ను కలిసారని, గీతాలోనో, మైత్రీలోనో సినిమా చేయబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. హమ్మయ్య అనుకునేలోగానే, వంశీ పైడిపల్లితోనే మహేష్ 27వ సినిమా అంటూ మరో వార్త. పైగా 2020 సమ్మర్ కే ఆ సినిమా అంటూ గ్యాసిప్.

దాంతో పరుశురామ్ పరిస్థితి మళ్లీ మొటిదికి వచ్చిందా? అన్నది అనుమానం. మైత్రీమూవీస్ కూడా మరీ ఈ సినిమా మీద సీరియస్ గా లేదని, మహేష్ ఊ అంటే చేద్దామని, లేదూ అంటే లేదు అనేలా వుందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయాలన్నది మైత్రీ కోరిక అని తెలుస్తోంది. పైగా మైత్రీ కూడా ఇప్పుడు ఏకంగా మూడు నాలుగు సినిమాల నిర్మాణంతో బిజీగా వుంది.

వంశీ పైడిపల్లితో సినిమా సెట్ చేయాలనే ప్రయత్నాలు కూడా కాస్త సీరియస్ గానే వున్నాయి. అది కూడా 27వ సినిమానే కావాలనే ప్రయత్నాలు గట్టిగానే వున్నాయి. వంశీ పైడిపల్లి - పరుశురామ్ ఈ ఇద్దరిలో ఎవరి సినిమా మహేష్ 27వ సినిమా అవుతుంది అన్నదానిపైనే తరువాత ఏంటీ? అన్నది డిసైడ్ అవుతుంది.

మహేష్ కనుక వంశీ పైడిపల్లికే ఓటు వేస్తే, పరుశురామ్ ఇంకా చాలాకాలం వెయింటింగ్ లోనే వుండిపోవాలేమో? కనుచూపు మేరలో హీరో అన్నవాళ్లు ఖాళీగా కనిపించడం లేదు.

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?