రణ్ భీర్ కపూర్- కత్రినాకైఫ్ ల ప్రేమ విఫలం లో బాధిత స్థానంలో ఉందట కత్రినా కైఫ్. పెళ్లి చేసేసుకుంటాం అని ఆ మధ్య ప్రకటించిన ఈ జంట అంతకన్నా మునుపే కలిసి కాపురం పెట్టేశారు. ముంబైలో ఒక ఫ్లాట్ కు చేరి..లవ్ నెస్ట్ గా దానికి పేరు పెట్టుకుని సహజీవనం చేశారు. త్వరలోనే పెళ్లి అన్నారు.
అయితే ఏమైందో కానీ.. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. బాలీవుడ్ సినిమా వాళ్లకు ఇలాంటి బ్రేకప్ లన్నీ మామూలే కావొచ్చు.. అయితే బ్రేకప్ తో కత్రినా చాలానే బాధపడిందట. ఆ తర్వాత ఆమెలో చాలా మార్పులే వచ్చాయంటారు. ముఖ్యమైనది ఒంటరితనం!
దీన్ని తట్టుకోలేకే..ఆమె చాలా త్వరగా ఆదిత్య రాయ్ కపూర్ కు దగ్గరైందని అంటారు. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ తనయుడొకరు కూడా కత్రినాకు చాలా దగ్గరయ్యాడట! అయితే ఆదిత్యతో ప్రేమ మాత్రం కత్రినాకు రణ్ భీర్ ను కొంత వరకూ మురిపిస్తోందని తెలుస్తోంది.
ఇలా సాగుతున్నా.. రణ్ భీర్ అంటే మాత్రం కత్రినాకు ప్రేమతో కూడిన కోపం తగ్గలేదని అంటున్నారు. ఇటీవల రణ్ భీర్ కొత్తగానిర్మించుకున్న ఫ్లాట్ లో చేరాడు. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇంటీరియర్ డెకరేషన్ కే ముప్పై ఐదు కోట్లు వెచ్చించాడట రణ్ భీర్. దాని ఓపెనింగ్ సెర్మనీ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించాడు!
తన సన్నిహితులందరినీ పిలిచాడు కానీ.. కత్రినాకు మాత్రం ఆహ్వానం దక్కలేదు. దీంతో ఆమె మరింతగా రగిలిపోయిందట. రణ్ భీర్ ఇంటి ఓపెనింగ్ రోజున.. అదేపనిగా ఆదిత్యను ఇంటికి పిలుచుకుని ఆతిథ్యం ఇచ్చిందట. ఆ రోజున కత్రినా ఇంటి దగ్గరకు ఆదిత్య రావడం మీడియా కంట పడింది. ఫొటోలు కూడా వెబ్ లోకి ఎక్కాయి!
కత్రినా- ఆదిత్య లు ఈ విషయాన్ని బహిరంగ పరచడానికే ఆసక్తి చూపించారని, ఇదంతా ఆమె ఒత్తిడే అనే మాట వినిపిస్తోంది. రణ్ భీర్ కొత్త ఫ్లాట్ సంబరంతో ఉండగా.. ఆదిత్యతో తన సాన్నిహిత్యాన్ని ప్రదర్శించి.. తను కూడా హ్యాపీగా ఉన్నాననే సంకేతాలు ఇవ్వడానికి ఆమె ప్రయత్నించిందని టాక్. మొత్తానికి ఆదిత్యపై ప్రేమ తో ఏమో కానీ.. రణ్ భీర్ పై కోపంతోనే కత్రినా ఈ కుర్రహీరోతో రొమాన్స్ చేస్తున్నట్టుంది!