సుందర్ పాండ్యన్ కు భారీ బడ్జెట్

సునీల్ రేంజ్ తో చూసుకుంటే సుందర్ పాండ్యన్ రీమేక్ కు కాస్త ఎక్కువే ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఫుల్ స్కేప్ లో సాగుతోంది.…

సునీల్ రేంజ్ తో చూసుకుంటే సుందర్ పాండ్యన్ రీమేక్ కు కాస్త ఎక్కువే ఖర్చు చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఫుల్ స్కేప్ లో సాగుతోంది. 13 నుంచి 15 వరకు బడ్జెట్ అవుతందని అంచనా వేస్తున్నట్లు వినికిడి. 

రీమేక్ హక్కులు, స్టార్ కాస్టింగ్ తో పాటు, సినిమాను మన నేటివిటీకి అనుగుణంగా, ఇప్పటి తరం ప్రేక్షకులకు కావాల్సిన విధంగా, ఎక్కడా రాజీ పడకుండా స్క్రిప్ట్ ను తయారు చేసుకోవడం వల్లనే బడ్జెట్ ఈ రేంజ్ కు చేరుకుందని యూనిట్ వర్గాల బోగట్టా. అయితే సబ్జెక్ట్ మీదున్న నమ్మకం, సినిమా హిట్ కావడం గ్యారంటీ అన్న ధైర్యం నిర్మాతలను వెనక్కు తీయడం లేదు. అంటే సునీల్ కు కాస్త మంచి ప్రాజెక్టు దొరికినట్లేగా.