మహేష్‌బాబుకి వదినగా నటిస్తే తమ కెరీర్‌కి ఇబ్బంది అని అప్పట్లో చాలా మంది హీరోయిన్లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేష్ సరసన నటించడానికి వెనుకాడారు. ఆ ఎఫెక్ట్ ఏంటనేది అప్పుడు అంతగా ఆలోచించని అంజలికి అదేంటో ఇప్పుడు బాగా తెలుస్తోంది. యువ హీరోల సరసన అవకాశాలు ఆమెకి అస్సలు రావడం లేదు.
వయసు ముప్పయ్ లోపే అయినా కానీ తనకి ఏజ్ బార్ హీరోలతోనే ఛాన్స్‌లు వస్తున్నాయి. రామ్‌కి అక్కగా, వెంకటేష్‌కి జోడీగా మసాలాలో నటించిన అంజలి ఆల్రెడీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఓకే చెప్తోంది. తాజాగా ఆమెకి బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చింది. లెజెండ్‌తో సక్సెస్ అయిన బాలకృష్ణ ఇదే ఊపులో గాడ్సే టైటిల్‌తో ఒక కొత్త దర్శకుడితో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
ఇందులో అంజలికి ఛాన్స్ వచ్చింది. వెంకటేష్, బాలకృష్ణతో నటించడమంటే ఇక అంజలికి సూటయ్యే ఏజ్ గ్రూప్ హీరోలు నాగార్జున తప్ప ఇంకెవరూ లేనట్టే. ఈ సీనియర్లు ఎన్ని అవకాశాలిస్తే వాటి మీదే అంజలి కెరీర్ డిపెండ్ అవుతుంది. ఇక ఇవి కాకుండా ప్రస్తుతం చేస్తున్న గీతాంజలిలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకోవాలి.