ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కొరటాల శివ డైరక్షన్ లోనే అనే క్లారిటీ అయితే ఇండస్ట్రీలో వచ్చేసింది. అయితే ఆచార్య విడుదలయిన తరువాత దీనికి ఓపెనింగ్ షాట్ పడేది. అప్పుడు కూడా ప్రీ పొడక్షన్ వర్క్ మొదలవుతుంది. ఆ తరువాత షూట్ ప్రారంభం. అప్పటి వరకు ఎన్టీఆర్ విశ్రాంతి మోడ్ లో వుంటారు.
ఇదిలా వుంటే సలార్ సినిమా ఎప్పడయితే రెండు భాగాలు అవుతుందని తెలిసిందో చాలా మంది డైరక్టర్లు ఎన్టీఆర్ వైపు చూస్తున్నారు. పైగా ఎన్టీఆర్ పాన్ ఇండియా భారీ సినిమా చేసే మూడ్ లో లేరని వినిపిస్తుండడంతో గతంలోనే ఫిక్స్ అయిన బుచ్చిబాబు, అనిల్ రావిపూడి వంటి డైరక్టర్లు అంతా ఎన్టీఆర్ వైపు కదులుతున్నారు.
అయితే ఎన్టీఆర్ అయితే ప్రస్తుతానికి కొరటాల శివ సినిమా మీదనే ఫిక్స్ అయి వున్నారు. ఆ తరువాత ఏమిటి అన్నది ఇప్పట్లో డిసైడ్ కాదని బోగట్టా. ఎందుకంటే కొరటాల శివ ఎంత లేదన్నా పూర్తి కావడానికి ఏడెనిమిది నెలలు పడుతుంది. అంటే ఈ ఏడాది చివరికి కానీ రెడీ కాదు.
పైగా అనిల్ రావిపూడి ఈ లోగా రెండు సినిమాలు చేయాలి. ఎఫ్ 3, బాలయ్య సినిమా. ఈ రెండూ సక్సెస్ అయితేనే ఎన్టీఆర్ సై అనేది. లేదంటే మళ్లీ అక్కడ తేడా వచ్చేస్తుంది.
ప్రశాంత్ నీల్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేయాలని తెగ ఉత్సాహంగా వున్నారు. అందువల్ల ఏ మాత్రం టైమ్ సెట్ అయినా ఎన్టీఆర్ అటే మొగ్గు చూపడానికి అవకాశం వుంది. అప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు అన్నీ వార్తల్లోనే వుంటాయి.