Advertisement

Advertisement


Home > Movies - Press Releases

డబ్బు చుట్టూ తిరగే ‘మణిశంకర్’

డబ్బు చుట్టూ తిరగే ‘మణిశంకర్’

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం `మ‌ణిశంక‌ర్‌`. డ‌బ్బు చుట్టూ తిరిగే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌-క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ భాద్య‌త‌ల్ని జి.వి.కె(జి. వెంక‌ట్‌కృష్ట‌ణ్‌) నిర్వ‌హించారు. 

లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మించారు. మ‌ణిశంక‌ర్ మూవీ టీజ‌ర్‌ను ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఇప్ప‌టికే ఐదు ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా....

ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ - `మ‌ణిశంక‌ర్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని ద‌ర్శ‌కుడు జీవీకే ఈ స్క్రిప్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. రియ‌లెస్టిక్‌గా ఉంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ - `` మా మ‌ణిశంక‌ర్ మూవీ టీజ‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌గారి చేతుల‌మీదుగా రిలీజ‌వ‌డం హ్యాపీగా ఉంది. మ‌ణిశంక‌ర్ అనేది ఒక యాక్షన్ థ్రిల్ల‌ర్‌. మంచి కంటెంట్‌ని యాక్ష‌న్ మోడ్‌, స‌స్పెన్స్ వేలో చెప్ప‌డం జ‌రిగింది.

హీరో శివ కంఠ‌మ‌నేని మాట్లాడుతూ - ``టీజ‌ర్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం. మంచి ఎంట‌ర్‌టైన‌ర్ స‌బ్జెక్ట్‌. మ‌ణిశంక‌ర్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ చేసే కొన్ని డీలింగ్స్‌కి సంభందించిన క‌థ‌. సంజ‌న‌, చాణుక్య‌, ప్రియా హెగ్డే ఈ నాలుగు పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థ‌. మీరంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది``అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?