మూడు పూటలు ఇడ్లీ-వడ తింటాను

సౌతిండియా టిఫిన్స్ అంటే రీతూ వర్మకు చాలా ఇష్టమంట. మరీ ముఖ్యంగా ఇడ్లీ, దోశ అంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టం అని చెబుతోంది.

ప్రతి హీరోయిన్ కు భోజనం విషయంలో ఓ ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది. హీరోయిన్ రీతూ వర్మకు కూడా అలాంటి ఓ టేస్ట్ ఉంది. అది కామన్ గా అనిపించొచ్చు కానీ, ఆమె మాత్రం అదే తనకిష్టం అంటోంది.

సౌతిండియా టిఫిన్స్ అంటే రీతూ వర్మకు చాలా ఇష్టమంట. మరీ ముఖ్యంగా ఇడ్లీ, దోశ అంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టం అని చెబుతోంది. ఇడ్లీలో కారంపొడి, నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెబుతోంది. తనకు 3 పూటలు ఇడ్లీ-దోశ ఇచ్చినా తింటానని, ఎలాంటి కంప్లయింట్ చేయనని చెబుతోంది.

అయితే ప్రతిరోజూ ఇదే తినడం కరెక్ట్ కాదు కాబట్టి, సెకెండ్ ఆప్షన్ గా పప్పు-అన్నం అంటే ఇష్టమంటోంది రీతూ. వేడి అన్నంలో, వేడి పప్పు ఉంటే ఆ పూటకు భోజనం పూర్తిచేస్తానని చెబుతోంది.

అయితే కొత్త వంటకాలు ట్రై చేయడం కూడా ఇష్టమంట ఈ ముద్దుగుమ్మకి. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహార పదార్థాలు టేస్ట్ చేస్తుంటానని చెబుతోంది. అలా తిన్నవాటిలో జపనీస్ రుచులంటే బాగా ఇష్టం ఏర్పడిందని, బయట రుచులు తినాలని మనసుకు అనిపించినప్పుడు జపనీస్ వంటకాల్ని ట్రై చేస్తుంటానని చెబుతోంది.

మజాకా సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ హీరోయిన్. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకుడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వంటకాల్లో తన ఇష్టాఇష్టాల్ని బయటపెట్టింది రీతూ.

2 Replies to “మూడు పూటలు ఇడ్లీ-వడ తింటాను”

Comments are closed.