చంద్రమఖి తరువాత రాజాసాబ్

హర్రర్ సినిమాల్లో కామెడీ టచ్ వున్న సినిమాలు వేరు. అలాగే వాటికి ఫ్యామిలీ టచ్ ఇచ్చినవి ఇంకా వేరు. అంతే కాదు.. ఇంకో కేటగిరి కూడా వుంది. స్టార్ హీరోలు చేసిన ఫ్యామిలీ ఫన్…

హర్రర్ సినిమాల్లో కామెడీ టచ్ వున్న సినిమాలు వేరు. అలాగే వాటికి ఫ్యామిలీ టచ్ ఇచ్చినవి ఇంకా వేరు. అంతే కాదు.. ఇంకో కేటగిరి కూడా వుంది. స్టార్ హీరోలు చేసిన ఫ్యామిలీ ఫన్ హర్రర్ సినిమాలు. ఈ జానర్ లో ఫిట్ అయ్యే ఏకైక సినిమా చంద్రముఖి. రజ‌నీ లాంటి సూపర్ స్టార్ చేసిన సినిమా ఇది. దానికి తగిన సపోర్టింగ్ నటులు, ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు అన్నీ పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇలాంటి ప్యాకేజ్‌ సినిమా మళ్లీ రాలేదు.

ఇప్పుడు వస్తోంది. అదే రాజా సాబ్. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా బిగ్ స్టార్. మారుతి మార్క్ ఎంటర్ టైన్ మెంట్. ఫ్యామిలీ టచ్ ఎలాగూ వుంటుంది. మామూలుగా వచ్చే హర్రర్ కామెడీ సినిమాల మాదిరిగా కాకుండా హెవీ బడ్జెట్, దానికి తగిన చిత్రీకరణ వుంటుంది. అందుకే రాజా సాబ్ సమ్ థింగ్ స్పెషల్.

కొడితే మళ్లీ సౌండ్ మామూలుగా వుండదు. ఓ లెవెల్ లో వినిపిస్తుంది. కానీ అంతా దర్శకుడు మారుతి చేతిలోనే వుంది. ఫన్ కొత్తగా వుండాలి. నేలబారుగా, చౌకబారుగా, ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే లేకిగా వుండకూడదు. ఫ్యామిలీ ఎమోషన్లు బలంగా లేకపోయినా ఫరవాలేదు. కానీ దానికి తగిన స్టార్ కాస్ట్ వుండాలి. మారుతి తన సినిమాల నిలయవిద్వాంసులను అందరినీ తీసుకువచ్చి పెడితే కచ్చితంగా, బి గ్రేడ్ సినిమాలా కనిపిస్తుంది, ఎంత ప్రభాస్ వున్నా కూడా.

డైలాగుల్లో ఫన్ వుండాలి, పాటల్లో పస వుండాలి. ఒకటి రెండు అయినా మంచి ఫైట్లు వుండాలి. అన్నింటికి మించి సినిమా ప్రభాస్ లెవెల్ కు వుండాలి. చుట్టేసారు. సిజిలతో మొత్తం కానిచ్చేసారు అని అనిపించుకోకూడదు. సిజి నా, రియల్ నా అన్నది కాస్త సందేహంగా వెంటాడుతూ వుండాలి. ఇప్పుడు వదిలిన గ్లింప్స్ అయితే మొత్తం సిజి అని డప్పేసి చాటేస్తోంది. గ్లింప్స్ వరకు కనుక చల్తా.

సో అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుని, మారుతి సినిమానేనా అనేంత కొత్తగా, బలంగా, భారీగా వుంటే చంద్రముఖి అప్పట్లో ఎలా బ్లాక్ బస్టర్ అయిందో, ఇప్పుడు దేశం అంతా మారుమోగుతుంది రాజా సాబ్ పేరు. దాంతో పాటే దర్శకుడు మారుతి పేరు కూడా.

9 Replies to “చంద్రమఖి తరువాత రాజాసాబ్”

Comments are closed.