ఆహా అన్ స్టాపబుల్ కార్యక్రమం పెద్ద హిట్. అందులో సందేహం లేదు. సీజన్ వన్ అన్నది బాలయ్యకు కొత్త. అందువల్ల ఎక్కువగా కాల్ షీట్లు ఇవ్వాల్సిన పని లేదని అప్పట్లో ఆయన తీసుకున్న రెమ్యూనిరేషన్ జస్ట్ రెండున్నర కోట్లు అని బోగట్టా.
అయితే తన షో ఇంపాక్ట్ అప్పట్లో బాలయ్యకు తెలియదు. ఆ షో కారణంగా ఆహా సబ్ స్క్రిప్షన్లు 15 లక్షల వరకు పెరిగాయని అంచనా. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ కాబోతోంది. కానీ సారి బాలయ్యకు క్లారిటీ వచ్చింది. అందువల్ల ఆయన కాస్త భారీ రెమ్యూనిరేషన్ నే కోట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి బాలయ్య రెమ్యూనిరేషన్ అన్నది ఇంకా ఫైనల్ కాలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. కానీ బాలయ్య కోట్ చేసిన ఫిగర్ 10 కోట్లు అని వినిపిస్తోంది. మరి అంత మొత్తం ఇస్తారా? బేరం ఎక్కడ సెటిల్ అవుతుంది అన్నది ఇంకా తెలియదు. అయిదు నుంచి ఆరు కోట్ల దగ్గర సెటిల్ కావచ్చు అని వినిపిస్తోంది. ఈసారి కూడా సబ్ స్క్రిప్షన్లు బాగా పెరుగుతాయని, పెరగాలని ఆహా ఆశిస్తోంది. ప్రస్తుతం ఆహా సబ్ స్క్రిప్షన్లు చాలా తగ్గాయని తెలుస్తోంది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 వల్ల మళ్లీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అందులో తొలి ఎపిసోడ్ చంద్రబాబుతో చేస్తున్నారు. ఇది దీపావళికి కాస్త అటు ఇటుగా ప్రసారం కావచ్చు. బాలయ్య అభిమానులు, తెలుగుదేశం అభిమానులు పెద్ద సంఖ్యలో ఆహా సబ్ స్క్రయిబర్లు అవుతారని లెక్క వేస్తున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా అయితే జనసైనికుల వైపు నుంచి కూడా సపోర్ట్ వుంటుందని అనుకుంటున్నారు.