మంచి ఎనర్జీ జోడి- రామ్- భాగ్యశ్రీ

మిస్టర్ బచ్చన్ అరివీర భయంకర డిజాస్టర్. అంత దారుణ పరాజయాలు చాలా తక్కువ వుంటాయి. కానీ ఆ సినిమాలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ కి మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాలో తన…

మిస్టర్ బచ్చన్ అరివీర భయంకర డిజాస్టర్. అంత దారుణ పరాజయాలు చాలా తక్కువ వుంటాయి. కానీ ఆ సినిమాలో నటించిన హీరోయిన్ భాగ్యశ్రీ కి మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాలో తన గ్లామర్, సాంగ్స్ లో డ్యాన్స్ అన్నీ ఇండస్ట్రీ దృష్టికి వచ్చింది. అందువల్ల చేతిలోకి వన్ బై వన్ మూడు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో మంచి చాన్స్ వచ్చింది.

రామ్ పోతినేని, కొత్త దర్శకుడు మహేష్ కాంబినేషన్ లో మైత్రీ సంస్థ నిర్మించే సినిమాకు భాగ్యశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారు. రామ్ చాలా ఎనర్జీతో డ్యాన్స్ లు చేస్తారు. మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ కూడా అద్భుతంగా డ్యాన్స్ లు చేసింది. సో, ఇప్పుడు ఈ రెండు ఎనర్జీలు పెర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి.

రామ్ చేసే సినిమాల్లో హీరోయిన్ కు కీలకంగా వుండేది పాటలు, డ్యాన్స్ లే. అందువల్ల భాగ్యశ్రీ పెర్ ఫెక్ట్ సెలక్షన్ అనుకోవాలి.

రామ్ చేసే ప్రతి సినిమాకు హీరోయిన్ ల సెలక్షన్ వరకు బాగానే వుంటుంది. అప్పటికి ట్రెండింగ్ లో వున్న హీరోయిన్ నే తీసుకుంటారు. కానీ స్క్రిప్ట్ ల సెలక్షన్ దగ్గరే సమస్య అవుతోంది. ఈసారి ఆ సమస్య ను అధిగమిస్తారేమో చూడాలి.

4 Replies to “మంచి ఎనర్జీ జోడి- రామ్- భాగ్యశ్రీ”

  1. రామ్ భాగ్యశ్రీ కన్నా పొట్టోడు. పోనీలే కనీసం ఆమెకి పెన్సిల్ హీల్స్ వేసుకొని యూరోప్ అంతా పరిగెత్తే డ్యాన్సులు చేసే బాధ లేదు. బచ్చన్ సినిమాలో కూడా ఇలాగే.

Comments are closed.