నాగచైతన్య కూడా హ్యాండ్ ఇచ్చాడా?

చూస్తుంటే, పూజాహెగ్డే ఇప్పట్లో టాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఏ ముహూర్తాన ఆమె గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందో కానీ, అప్పట్నుంచి ఇప్పటివరకు తెలుగుతెరపై కనిపించలేదు. ఇంకా స్ట్రయిట్…

చూస్తుంటే, పూజాహెగ్డే ఇప్పట్లో టాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఏ ముహూర్తాన ఆమె గుంటూరు కారం ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందో కానీ, అప్పట్నుంచి ఇప్పటివరకు తెలుగుతెరపై కనిపించలేదు. ఇంకా స్ట్రయిట్ గా చెప్పాలంటే ఎఫ్3లో ఐటెంసాంగ్ తర్వాత టాలీవుడ్ కు దూరమైంది పూజాహెగ్డే.

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. అయితే తెలుగు నుంచి ఆమెకు పిలుపు రావడం లేదు. మొన్నటివరకు నాగచైతన్య పేరు గట్టిగా వినిపించింది.

పూజాహెగ్డేను టాలీవుడ్ కు పరిచయం చేసిన నాగచైతన్య, ఇప్పుడామె రీఎంట్రీకి కూడా చేయందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతడు హ్యాండిచ్చాడు.

త్వరలోనే కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతూ. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోబోతున్నట్టు చాన్నాళ్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడామె స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చిచేరింది.

సో.. ఇన్నాళ్లూ పుకార్లలో వినిపించిన సినిమా కూడా పూజాహెగ్డే చేజారింది. మళ్లీ ఆమె ఏ హీరో సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతుందో చూడాలి

9 Replies to “నాగచైతన్య కూడా హ్యాండ్ ఇచ్చాడా?”

  1. ఇకపై చేస్తే శోభిత తొ చెయ్యాలి.. లేదంటే ఇంట్లో కూర్చొని సంసారం చెయ్యాలి…

    1. చిట్టుక వేస్తే హీరోయిన్స్ లైన్ లో నిల్చుంటారు

      అక్కినేని హీరో లకు హీరోయిన్స్ కోసం మిగతా కొండ ముచ్చు హీరోలు వెతుక్కోవాలి అక్కినేని అందగాళ్లకి ఆ అవసరం లేదు

Comments are closed.