సీఎం ర‌మేశ్ కంపెనీ ప‌నుల్ని అడ్డుకున్న ‘ఆది’ అనుచ‌రులు!

అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడు, జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి… ఇద్ద‌రూ బీజేపీ నాయ‌కులే. ఇద్ద‌రూ ఒకే జిల్లా, ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కులే కావ‌డం విశేషం. అయితే త‌మ్ముడు త‌మ్ముడే, పేకాట పేకాటే అన్న…

అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడు, జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి… ఇద్ద‌రూ బీజేపీ నాయ‌కులే. ఇద్ద‌రూ ఒకే జిల్లా, ఒకే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కులే కావ‌డం విశేషం. అయితే త‌మ్ముడు త‌మ్ముడే, పేకాట పేకాటే అన్న రీతిలో ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సీఎం ర‌మేశ్‌నాయుడికి చెందిన రిత్విక్ కంపెనీ జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని కొండాపురం మండ‌లం దొబ్బుడుప‌ల్లెలో చేప‌ట్టిన ప‌వ‌ర్ ప్రాజెక్టు ప‌నుల్ని అడ్డుకున్నారు. సంస్థ ఇంజ‌నీర్ల‌పై దాడికి తెగ‌బ‌డ్డారు. సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే…

వైసీపీ హ‌యాంలో వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణ‌యించింది. కొండాపురం మండలం దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలం బొగ్గులపల్లె పరిధిలో 250 ఎకరాలు ప్రభుత్వ భూమి, 150 ఎకరాల ఫారెస్టు భూమిలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాల‌ని నాటి ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. మొద‌టి విడ‌త‌లో రూ.1,800 కోట్లతో ప‌నులకు శ్రీకారం చుటింది.

టెండర్లలో రిత్విక్ సంస్థకు పనులు దక్కాయి. ప‌నుల్ని ఆ సంస్థ మొదలు పెట్టింది. అయితే త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ త‌మ కనుస‌న్న‌ల్లో జ‌ర‌గాల‌ని ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు హుకుం జారీ చేశారు. దీంతో స్థానికంగా గొడ‌వ‌లెందుకు అని ఎమ్మెల్యే అనుచ‌రుల‌కు కొన్ని నిర్మాణ పనులు అప్పగించిన‌ట్టు తెలిసింది. వాటితో సంతృప్తి చెంద‌లేద‌ని స‌మాచారం. పనులన్నీ తమ వర్గీయులకే దక్కాలని, అప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయ‌ని తేల్చి చెప్పార‌ని తెలిసింది.

అయితే బెదిరింపుల‌ను లెక్క చేయ‌కుండా ప‌నులు చేస్తుండ‌డాన్ని ఆది వ‌ర్గీయులు స‌హించ‌లేక‌పోయారు. ఎమ్మెల్యే సోద‌రుడు దేవగుడి శివ నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి నేతృత్వంలో వంద వాహనాల్లో ప‌నులు జ‌రుగుతున్న దొబ్బుడుపల్లె ప్రాంతానికి వెళ్లారు. రిత్విక్ సైట్ ఇంజనీర్లపై దాడి చేశారు. అలాగే యంత్రాలను ధ్వంసం చేశారు. ప‌నులు నిలిపేసి వెళ్లిపోవాల‌ని ఆదేశించారు. ఒక‌వేళ ప‌నులు చేస్తామంటే ప్రాణాలు ద‌క్క‌వ‌ని హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే ఇంత జ‌రిగినా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

13 Replies to “సీఎం ర‌మేశ్ కంపెనీ ప‌నుల్ని అడ్డుకున్న ‘ఆది’ అనుచ‌రులు!”

  1. ఎమ్మెల్యే ని మందలించడం, ఎమ్మెల్యే సంజాయిషీ చెప్పడం కూడా జరిగింది.

      1. correct…ivemi kattubaatlu. oka MP public ga company vaarini bedirinchadam manchi kattubaatu. ade MP battalu vippi nude calls cheyyadam manchi kattubatu. Raasalelatho pattubadda MLA ni mantrini cheyyadam manchi kattubaatu

    1. ఎమ్మెల్యే ని మందలించడం, ఎమ్మెల్యే సంజాయిషీ చెప్పడం జరిగితే….. వార్త రాయకూడదా.. తెలియని పాఠకులకు విషయం తెలుపకూడదా?

    1. ఎమ్మెల్యే సంజాయిషీ చెప్పడం జరిగితే….. వార్త రాయకూడదా.. తెలియని పాఠకులకు విషయం తెలుపకూడదా?

      ఇష్యూ Escalate అయితే.. Resolve అయినట్టు కాదు కదా.. లంచావతారలను వెనకేసుకుకురాక.. తమరి.. ము DD! మూసుకోండి. అప్పుడేంత … బాగుంటుందో…!

  2. సాక్షి అంత పిత్త బరిగెల ముం..డాకొ..డుకు ఎవ్వడు లెడు …

    ప్రతిపక్ష MLA చెసిన దాడిని కూడ పెపర్ లొ రాయలెదు అంటె ..ఎంత ఎబ్రాసి ముం..డాకొ..డుకొ అర్థం అవుతావుంది

Comments are closed.