పూరి-చార్మి ‘పుడమి సాక్షిగా’

దర్శకుడు పూరి జగన్నాధ్ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఆయనలో విభిన్న భావాలు వున్నాయి. వాటిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగలరు కూడా.  Advertisement ఇప్పటికే పాడ్ కాస్ట్ తో ఆయన రకరకాల…

దర్శకుడు పూరి జగన్నాధ్ కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఆయనలో విభిన్న భావాలు వున్నాయి. వాటిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగలరు కూడా. 

ఇప్పటికే పాడ్ కాస్ట్ తో ఆయన రకరకాల అంశాల మీద తన అభిప్రాయాలను జనంలోకి పంపారు. లేటెస్ట్ గా పర్యావరణం, ప్రకృతి మీద ఓ షో ను చేయబోతున్నారు. సాక్షి టీవీలో ఈ కార్యక్రమం ఈ నెలాఖరులో ప్రసారం అవుతుంది.

ఈ రోజు, రేపు ఈ షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. 'పుడమి సాక్షిగా' అనే పేరుతో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం షూటింగ్ కోసం పూరి ముంబాయి నుంచి హైదరాబాద్ కు వచ్చారు. కరోనా తరువాత ఆయన ముంబాయి నుంచి కదలి రావడం ఇదే. తొలి రోజు పలు కార్యక్రమాలు చిత్రీకరిస్తారు. 

మలిరోజు కేటిఆర్, సంతోష్, అలాగే పర్యావరణ శాస్త్రవేత్తలతో డిస్కషన్లు, ముఖాముఖి చిత్రీకరిస్తారు. భారతి సిమెంట్స్ సంస్థ ఈ మొత్తం కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోంది గతంలో ఎన్ డి టి వి లో ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేసారు. 

దానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దాదాపు అదే విధంగా తెలుగులో పూరి జగన్నాధ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు.

పవన్ భయపడుతున్నారా?

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు