పూజాహెగ్డే.. నాని.. శ్రీనిధి శెట్టి

ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించక ముందే, నాని హీరో అని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పిందంట శ్రీనిధి.

ఉన్నఫలంగా ఇద్దరు హీరోయిన్లు, నానిపై తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వాళ్లే శ్రీనిధి శెట్టి, పూజాహెగ్డే. వీళ్లలో శ్రీనిధి, నానిపై ప్రశంసలు కురిపిస్తోందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, నాని సరసన ‘హిట్-3’ సినిమా చేసింది.

ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించక ముందే, నాని హీరో అని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పిందంట శ్రీనిధి. ఆ తర్వాతే నెరేషన్ విందంట. దీనికి కారణం, నాని సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కూడా బాగుంటాయని చెబుతోంది.

అదే విధంగా హిట్-3లో తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందని చెబుతోంది. టీజర్, ట్రయిలర్ లో తన పాత్రను పెద్దగా చూపించనప్పటికీ, సినిమాలో నాని భార్యగా తను పోషించిన పాత్ర చాలా బాగుంటుందని అంటోంది శ్రీనిధి.

ఇక మరో హీరోయిన్ పూజాహెగ్డే కూడా నానీని పొగడ్తల్లో ముంచెత్తుతోంది. తెలుగులో ఇప్పటికిప్పుడు ఏ హీరోతో నటించాలని ఉందనే ప్రశ్నకు సమాధానంగా ఆమె నాని పేరు చెప్పింది. నానితో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని తనతో చాలామంది చెప్పారని, అందుకే నాని సరసన నటించడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.

పూజాహెగ్డే నటించిన ‘రెట్రో’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఎఫ్-3లో చేసిన ఐటెంసాంగ్ తర్వాత తెలుగులో ఆమె ఇప్పటివరకు మళ్లీ బోణీ కొట్టలేదు.

2 Replies to “పూజాహెగ్డే.. నాని.. శ్రీనిధి శెట్టి”

  1. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

Comments are closed.