ఉద్యోగ కల్పనలో పాలకులు చెప్పేదానికి, వాస్తవ పరిస్థితికి అసలు పొంతన ఉండదు. ఉద్యోగాల విషయంలో పాలకులు బాగా గప్పాలు కొడతారు. మా పాలనలో వేల ఉద్యోగాలు ఇచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతుంటారు. కాని దేశంలో పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. చివరకు ప్యూన్ పోస్టులకు కూడా లక్షల మంది పోటీ పడుతున్నారు. అందులోనూ ఉన్నత విద్యావంతులు కూడా పోటీ పడుతుండటం విశేషం.
అయితే దేశంలో ఇది కొత్తగా పుట్టుకొచ్చిన పరిస్థితి కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. ప్రైవేటు రంగం ఎంతగా విస్తరిస్తున్నా, వేల కంపెనీలు పుట్టుకొస్తున్నా, పాలకులు విదేశాలకు వెళ్లి దేశంలో గొప్ప గొప్ప కంపెనీలు, పరిశ్రమలు తీసుకొచ్చామని చెబుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం తీరడంలేదు.
ప్రైవేటు రంగం పెరుగుతుతున్న మాట నిజమే అయినా, వాటి ద్వారా ఉద్యోగాలు వస్తున్న మాట నిజమే అయినా ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగాలకే డిమాండ్ ఎక్కువ. వాటికి ఉద్యోగ భధ్రత ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితానికి భరోసా ఉంటుంది. అది ఎంత చిన్న ఉద్యోగమైనా సరే.
అందుకే చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి కూడా లక్షల మంది పోటీ పడుతున్నారు. రాజస్థాన్లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం దాదాపు పాతిక లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. పీహెచ్డీ చేసినవారు, ఎంబీఏ చదివినవారు, లా డిగ్రీ చేసినవారు, సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు, ఇంకా ఇతరత్రా డిగ్రీలు ఉన్నవారు ప్యూన్ పోస్టులకు పోటీ పడుతున్నారు.
ప్యూన్ అయినా కోట్లు సంపాదించిన ఉదాహరణలు కోకొల్లలు. పైకి ఉద్యోగ పోటీ అయినా అసలు పోటీ అమ్యామ్యా కోసం దశాబ్దాలుగా.దాన్నే పైనుంచి కింది దాక తడపడం అంటారు ప్రభుత్వ కార్యాలయాలలో.
grade 4 employee kante pune ke ekkuva vastundi , andari deggara 10 paraka teesukunna chala pedda amount. Telugu states lo chala mandi konni years of work tarvata grade 4 employee ga promotion kuda teesukoru
ma jagan anna first class student,
actually its a very lengthy question ani modalu pedathadu !!!!