ఏపీలో రోజురోజుకీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిన ఆడపిల్లలపై అరాచకాలు తగ్గడం లేదు. నంద్యాల, విజయనగరం జిల్లాల్లో బాలికలపై అఘాయిత్యాలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని(13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లోని మంచంపై శవమై కనిపించడం సంచలనం రేపుతోంది.
బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో నాగరాజే అత్యాచారం, హత్య చేసి పరారయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సోమవారం ఉదయం ఏడవ తరగతి చదువుతున్న ఆ బాలిక బడికి వెడుతుండగా నాగరాజు అనే వ్యక్తి ఆ బాలికతో మాట్లాడి కూల్‌డ్రింక్ ఇవ్వడాన్ని స్థానికులు గమనించారు. సాయంత్రమైనా ఆ బాలిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడుతున్న తల్లిదండ్రులకు స్థానికులు ఉదయం జరిగిన విషయం చెప్పారు.
అనుమానంతో నాగరాజు ఇంటికి వెళ్లి కిటికిలోంచి లోపలికి చూడగా చలనం లేకుండా పడి ఉన్న బాలికను కనిపించడంతో తలుపులు పగలగొట్టి లోపలకి వెళ్లి చూడగా ఆ బాలిక చనిపోయి కనిపించింది. బాలిక మెడపై గోళ్లగాట్లు, గాజులు మంచంపై పగిలి, చెవి కమ్ములు ఊడిపడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.