వ‌ర్త‌మానం విస్మ‌రించి.. గ‌తం భ్ర‌మలో విహ‌రిస్తున్న బాబు!

అధికారంలో ఎవ‌రున్నా ఇంతే. వాస్త‌వాలు చెప్పే వాళ్ల‌ను ద‌గ్గ‌రికి రానివ్వ‌రు. చెప్పినా, త‌మ అనుభ‌వం అంత వ‌య‌సు కూడా లేని మీరు చెబుతారా?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ‌ర్త‌మానం విస్మ‌రించి, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మ‌నే గ‌తాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో కూడా జ‌గ‌న్ దుర్మార్గ పాల‌న చేశారని చెప్పి అధికారంలోకి రావ‌చ్చ‌నే భ్ర‌మ‌లో బ‌తుకుతున్నార‌నే భావ‌న క‌లిగిస్తోంది. వైసీపీ పాల‌నంతా విధ్వంసం, అరాచ‌కం అని ప‌దేప‌దే చంద్ర‌బాబు, ఆయ‌న స‌హ‌చ‌ర మంత్రులు, కూట‌మి నేత‌లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఇంత వ‌ర‌కూ ఓకే.

అయితే జ‌నాభిప్రాయం మ‌రోలా వుంద‌ని ఆయ‌న ప‌సిగ‌ట్ట‌లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చంద్ర‌బాబు పాల‌నలో సాగుతున్న అరాచ‌కాల్ని చూసి… జ‌గ‌న్ పాల‌నే మేలు అని జ‌నం అనుకుంటున్నారు. ఈ వాస్త‌వాన్ని అర్థం చేసుకోడానికి, జీర్ణించుకోడానికి పాల‌కుల‌కు అహం అడ్డొస్తోంది. ఇదే కూట‌మి పాలిట శాపంగా మార‌నుంది. అధికారంలో ఉన్నోళ్లకు వాస్త‌వాలు గిట్ట‌వు. సొంత మీడియాలోనే త‌మ పాల‌న‌లో సాగుతున్న అరాచ‌కాల్ని రాస్తున్నార‌నే గ్ర‌హింపు కూడా లేదు.

ఏకంగా ఐఏఎస్ అధికారుల భార్య‌లే, భ‌ర్త‌ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్టార్‌హోట‌ళ్ల‌లో వ్యాపారం చేస్తున్నారంటే, పాల‌న ఎంతగా ప‌క్క‌దారి ప‌ట్టిందో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలో జ‌గ‌న్ హ‌యాంలో ఇలాంటి ధోర‌ణి లేదే. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు కూట‌మి నేత‌లు చుక్క‌లు చూపుతున్నారు. అలాగే ఏ వ్యాపారాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ఇసుక‌, గ్రావెల్‌ను య‌థేచ్ఛ‌గా త‌ర‌లిస్తూ, సొమ్ము చేసుకుంటున్నారు.

మ‌రోవైపు కూట‌మి శ్రేణుల్లో తీవ్ర‌మైన అసంతృప్తి. వాస్త‌వాలు ఇలా వుంటే, చంద్ర‌బాబునాయుడు మాత్రం గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లు లేనే లేవ‌ని అసెంబ్లీ వెదిక‌గా ఆరోప‌ణ‌లు. ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా తిర‌గ‌లేని ప‌రిస్థితులు గ‌తంలో లేవ‌ని ఆయ‌న అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆయ‌న ఆరోపించారు. త‌న ప‌రిపాల‌న‌లో అంత‌కంటే దారుణ‌మైన ప‌రిస్థితులున్నాయ‌ని చంద్ర‌బాబు గ్ర‌హించే ప‌రిస్థితి లేక‌పోవ‌డమే… తొమ్మిది నెల‌ల్లోనే అసంతృఫ్తికి కార‌ణ‌మైంది.

ఎంత‌సేపూ గ‌తాన్ని గుర్తు చేస్తూ, తామేదో మంచి పాల‌న అందిస్తున్నామ‌నే భ్ర‌మ‌లో చంద్ర‌బాబు ఉన్నారు. రెడ్‌బుక్ పుణ్య‌మా అని ప్ర‌జ‌ల్లో ఎలాంటి భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టించామో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అర్థం కావ‌డం లేదు. అధికారంలో ఎవ‌రున్నా ఇంతే. వాస్త‌వాలు చెప్పే వాళ్ల‌ను ద‌గ్గ‌రికి రానివ్వ‌రు. చెప్పినా, త‌మ అనుభ‌వం అంత వ‌య‌సు కూడా లేని మీరు చెబుతారా? అని చంద్ర‌బాబు ఆగ్ర‌హిస్తార‌నే భ‌యం. అందుకే మ‌న‌కెందుకులే అని కూట‌మి శ్రేయోభిలాషులు విడిచిపెట్టారు. వాస్త‌వాల కంటే భ్ర‌మ‌లే తియ్య‌గా వుంటాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు భ్ర‌మ‌ల్ని ఆస్వాదిస్తున్నారు. ఎవ‌రి ఆనందం వాళ్ల‌ది.

11 Replies to “వ‌ర్త‌మానం విస్మ‌రించి.. గ‌తం భ్ర‌మలో విహ‌రిస్తున్న బాబు!”

  1. Anninnee nee telisi nattu raastaav…5 years evadi mo gga gudi saav la nja kod aka…cahh ina nee party san gati choo suko…munda lanja kodaka…Inka TDP Pe nta tin tee .1 kuda raadu…

  2. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గాల ఫలితాలు కొన్ని తరాలు అనుభవించాల్సి వస్తుంది. హత్య చేసిన వాడికి ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఇంటి పెద్ద ని కోల్పోయిన బాధిత కుటుంబం భవిష్యత్తు రాత్రికి రాత్రి మారిపోదు కదా.. అలానే రాష్ట్రాన్ని నాశనం చేసాక జగన్ ని దించేసినంత మాత్రాన అవన్ని గతం అని వాటి పర్యవసానాలు ఏమీ ఇంక ఉండవని అనుకుంటే వాడికన్నా మూర్ఖుడు ఉండడు. పరిపాలన అంటే పాలప్యాకెట్లు వెయ్యటం కాదు. నిన్నటిది నిన్నే.. ఇవాళ్టిది ఇవాళే అనుకోటానికి.

  3. రెడ్ బుక్ పుణ్యాన సామాన్య జనాలు ఎందుకు భయపడుతున్నారు స్వామి .. నీ బ్రహ్మ తప్పించి ..

  4. జగన్ గారు ఆదానీ గారి దగ్గర తీసుకొన్న 1650 కోట్ల లంచాన్ని రాష్ట్రప్రజలు శ్రేయస్సు దృష్ట్యా కనికరించి వెనక్కి ఇచ్చేస్తే మనం కూడా విద్యుత్తును గుజరాత్ రేట్ కె పొందొచ్చు దీనితో అనేక సంవత్సరాలు విద్యుత్ వినియోగ దార్లు తక్కువ ధరకే పొందొచ్చు కాకపోతే చెల్లెలి వాటా చెల్లెలికి ఇవ్వనోడు ఇవ్వకపోవచ్చు ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం అయినా అదానీ గారి డబ్బు ఖజానా నుంచి తీసి ఇచ్చేయాలి అప్పుడు అయన గుజరాత్ ధరకే ఇస్తాడు

Comments are closed.